NTR, Devara Movie: దేవర మూవీలో ఆ సీన్లకు గూస్ బంప్స్ వస్తాయట.. ఆ హత్యాకాండ ఆధారంగా తీస్తున్నారా?

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్( NTR ) ప్రస్తుతం నటిస్తున్న సినిమా దేవర.ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

 Devara Story Involves Real Incidents Of Dalits-TeluguStop.com

అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ దేవర చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఎన్టీఆర్ సోలో హీరోగా నటిస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

Telugu Devara, Janhvi Kapoor, Koratala Siva, Tollywood-Movie

మరోవైపు కొరటాల శివ( Koratala siva )ఆచార్య సినిమాతో భారీ డిజాస్టర్ చవి చూడడంతో ఈ సినిమాను చాలా పగడ్బందీగా ఎంతో జాగ్రత్తగా రూపొందిస్తున్నారు.ఇందులో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్( Janhvi Kapoor ) హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.అలాగే ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూడా నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.అప్పుడప్పుడు ఈ సినిమా నుంచి అప్డేట్లను విడుదల చేస్తూ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

Telugu Devara, Janhvi Kapoor, Koratala Siva, Tollywood-Movie

అదేమిటంటే దేవర సినిమా కథను కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందిస్తున్నారట కొరటాల శివ. దేవర ( Devara movie )చిత్రాన్ని గతంలో దళితులపై జరిగిన క్రూరమైన హత్యాకాండ ఆధారంగా రూపొందింస్తున్నట్లు తెలుస్తోంది.కారంచేడు విషాద ఘటనను ఇందులో చూపించనున్నారని సమాచారం.1985లో ఏపీలోని కారంచేడు గ్రామంలో అనేక మంది దళితులు అగ్రవర్ణాల చేతిలో బలయ్యారు.ఈ రియల్ లైఫ్ ఇన్సిడెంట్‌ను దేవర చిత్రంలో చూపించడానికి కొరటాల శివ ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు నుంచి సమాచారం.కొరటాల శివ ఇప్పటి వరకు తీసిన ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశాన్ని ఇవ్వడం లేదంటే ఏదైనా సామాజిక అంశాన్ని టచ్ చేస్తూ వచ్చారు.

ఇప్పుడు ఎన్టీఆర్ దేవర కథలో కూడా కారంచేడు విషాద ఘటనకు సంబంధించిన సన్నివేశాలు ఉండవచ్చని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube