Aata Sundeep : బిగ్ బాస్ షో సీజన్7లో ఆ జోడీ ఎంట్రీ గ్యారంటీ.. సీజన్7 పక్కా హిట్ అనేలా?

ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ షో గురించి మనందరికీ తెలిసిందే.తెలుగులో బిగ్ బాస్ షో ఇప్పటివరకు 6 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.

 Couple Who Is Going To Enter Bigg Boss Is Leaked-TeluguStop.com

అలాగే ఒక ఓటీటీ నీ కూడా పూర్తి చేసుకుంది.ఇది ఇలా ఉంటే త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా కూడా బిగ్ బాస్ మేనియానే నడుస్తోంది.ఇదే విషయం గురించి ఎక్కడ చూసినా కూడా చర్చించుకుంటున్నారు.

సోషల్ మీడియాలో కూడా గత కొద్ది రోజులుగా బిగ్ బాస్ కి సంబంధించిన అనేక రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

Telugu Aata Sundeep, Bigg Boss, Chandrahaas, Jyothi, Leak, Nagarjuna, Prabhakar-

ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోయేది వేరే అంటూ పలువురు సెలబ్రిటీలు కామన్ మ్యాన్ ల పేర్లు కూడా వినిపించాయి.ఇటీవల బిగ్ బాస్ రూములను కూడా విడుదల చేయడంతో ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు.త్వరలోనే రాబోతోంది అనడానికి బిగ్ బాస్ నిర్వాహకులు హింట్ ఇచ్చారు.

అలాగే ఈసారి కూడా బిగ్ బాస్ కి నాగార్జున( Nagarjuna )నే హోస్ట్గా వ్యవహరించబోతున్నారు అన్న విషయం పై కూడా క్లారిటీ వచ్చేసింది.ఇప్పుడు కంటెస్టెంట్ల విషయంలోనే అనేక రకాల చర్చలు కూడా నడుస్తున్నాయి.

కాగా బిగ్ బాస్ సీజన్7 లో కంటెస్టెంట్లుగా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి.

Telugu Aata Sundeep, Bigg Boss, Chandrahaas, Jyothi, Leak, Nagarjuna, Prabhakar-

అందులో భరత్, ఉదయభాను, ఢీ ఫేం పండు, సురేఖ, అమర్ దీప్, తేజస్విని, మోహన భోగరాజు, హేమచంద్ర, శ్రావణ భార్గవి, విష్ణు ప్రియ, పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.అలాగే నటుడు, బుల్లితెర మెగాస్టార్‌‌గా పిలువబడే ప్రభాకర్ కూడా వెళ్తున్నాడని రుమార్లు వస్తున్నాయి.ఒకవేళ ప్రభాకర్( Prabhakar ) రాకపోయినా తన కొడుకు చంద్రహాస్‌‌ని రంగంలోకి దించే అవకాశం ఉందని తెలుస్తోంది.

తాజాగా ఈ లిస్ట్ లోకి మరో జంట చేరింది.ప్రముఖ డాన్స్ మాస్టర్ అయిన ఆట సందీప్, జ్యోతి( Aata sundeep ) జంట కూడా ఈ సీజన్ లో కనిపించే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఆట ప్రొగ్రామ్ ద్వారా మంచి పేరు, ఫేమ్ సంపాదించుకున్నాడు.సందీప్‌‌కి సోషల్ మీడియాలో చాలా క్రేజ్ ఉంది.ఎప్పడికప్పుడు రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌‌గా ఉంటాడు.సినిమా ఈవెంట్లు, కవర్ సాంగ్స్ చేస్తూ తనదైన మార్క్ డాన్స్‌‌లతో జనాలను అలరిస్తుంటాడు.

ఈ జంట మాత్రం బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇవ్వడం ఖాయం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube