హరి హర వీరమల్లు అప్డేట్ ఇచ్చిన హీరోయిన్‌

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న హరి హర వీరమల్లు సినిమా చిత్రీకరణ ఇప్పటి వరకు పూర్తి అయ్యి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

కాని కరోనా కారణంగా హరి హర వీరమల్లు సినిమాను ఇప్పటి వరకు పూర్తి చేయలేక పోయారు.

షూటింగ్‌ ను కరోనా సెకండ్‌ వేవ్‌ కు ముందు పవన్ కు కరోనా రావడం వల్ల నిలిపి వేశారు.అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్లీ షూటింగ్ ను పునః ప్రారంభించలేదు.

పెద్ద ఎత్తున అంచనాలున్న హరి హర వీరమల్లు సినిమాలో హీరోయిన్‌ గా నిధి అగర్వాల్‌ నటిస్తున్న విషయం తెల్సిందే.సినిమాకు సంబంధించిన చిత్రీకరణ పునః ప్రారంభం మరియు షూటింగ్ అప్ డేట్ ను నిధి అగర్వాల్‌ ఇచ్చింది.

తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాల గురించి క్లారిటీ ఇచ్చింది.

Advertisement

హరి హర వీరమల్లు సినిమా ను ఒక అద్బుతంగా దర్శకుడు క్రిష్‌ తెరకెక్కిస్తున్నారు.పవన్‌ కళ్యాణ్‌ గారితో నటించడం అద్బుత అవకాశంగా నేను భావిస్తున్నాను.సినిమాలో నా పాత్ర అందరికి ఆశ్చర్యంగా ఉంటుంది.

అసలు ఇలాంటి పాత్రను క్రిష్ గారు నాకు ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను.పాత్రకు ది బెస్ట్‌ ఇచ్చేందుకు నావంతు కృషి చేస్తానంటూ నిధి అగర్వాల్‌ చెప్పుకొచ్చింది.

హీరోయిన్ గా సుదీర్ఘ కాలం కొనసాగేలా ఈ పాత్ర నిధి అగర్వాల్‌ కు ఉంటుందని కూడా యూనిట్‌ సభ్యులు అంటున్నారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ కోసం క్రిష్ ఏర్పాట్లు చేస్తున్నారని.

సెప్టెంబర్ లో సినిమా చిత్రీకరణ మొదలు పెట్టబోతున్నట్లుగా నిధి అగర్వాల్‌ చెప్పుకొచ్చింది.ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ మలయాళః మూవీ రీమేక్‌ లో నటిస్తున్న విషయం తెల్సిందే.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

రానా తో కలిసి ఆ సినిమా చిత్రీకరణ లో పాల్గొంటున్నాడు.ఆ సినిమా తర్వాత హరి హర వీరమల్లు సినిమా షూట్‌ లో జాయిన్‌ అవ్వబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు