హీరోతో డేట్ చేయకూడదని షరతు విధించారు.. నిధి అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు!

తెలుగు ప్రేక్షకులకు నిధి అగర్వాల్( Nidhi Agarwal ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ముద్దుగుమ్మ నటించిన తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇకపోతే ప్రస్తుతం ఈమె పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు( Hari Hara Veeramallu ) సినిమాతో పాటు ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజా సాబ్ సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది నిధి అగర్వాల్.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె ఒక పాడ్ కాస్ట్ లో పాల్గొన్నారు.

Nidhhi Agerwal Latest Comments On Cyber Bullying And No Dating Clause Details, N

ఈ సందర్భంగా ఆమె కెరియర్ విషయాలతో పాటు సినిమాలకు సంబంధించిన విషయాలు అలాగే కెరియర్ స్టార్టింగ్ లో ఎదురైన ఇబ్బందులను గుర్తు చేసుకున్నారు.ఈ సందర్భంగా నిధి అగర్వాల్ మాట్లాడుతూ.మున్నా మైకేల్‌( Munna Michael ) సినిమాతో సినీ పరిశ్రమలో నా కెరీర్‌ మొదలైంది.

Advertisement
Nidhhi Agerwal Latest Comments On Cyber Bullying And No Dating Clause Details, N

ఇదొక బాలీవుడ్‌ చిత్రం.టైగర్‌ ష్రాఫ్‌( Tiger Shroff ) కథానాయకుడిగా నటించారు.

ఈ సినిమాకు ఓకే చెప్పిన తర్వాత టీమ్‌ నాతో ఒక కాంట్రాక్ట్‌ పై సంతకం చేయించుకుంది.సినిమాకు సంబంధించిన నేను పాటించాల్సిన విధి విధానాలు ఆ కాంట్రాక్ట్‌ లో పొందుపరిచి ఉన్నాయి.

అందులోనే నో డేటింగ్‌ అనే షరతు పెట్టారు.

Nidhhi Agerwal Latest Comments On Cyber Bullying And No Dating Clause Details, N

సినిమా పూర్తయ్యే వరకూ హీరోతో నేను డేట్‌ చేయకూడదని దాని సారాంశం.కాంట్రాక్ట్‌ మీద సంతకం చేసినప్పుడు నేను పెద్దగా ఇవన్నీ చదవలేదు.ఆ తర్వాతే నాక్కూడా ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయాను.

అల్లూరి బయోపిక్ తీస్తానని చెబుతున్న కృష్ణవంశీ.. రామ్ చరణ్ హీరోగా నటిస్తారా?
ఏపీలో రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాల టికెట్ రేట్లు పెంపు.. ఎంత పెంచారో మీకు తెలుసా?

నటీనటులు ప్రేమలో పడితే వర్క్‌ పై దృష్టి పెట్టరని ఆ టీమ్‌ భావించి ఉండవచ్చు.అందుకే ఇలాంటి షరతులు పెట్టి ఉంటుందనుకున్నాను అని నిధి అగర్వాల్‌ తెలిపారు.

Advertisement

ఈ సందర్బంగా ఆమె చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజా వార్తలు