Power Crisis : వచ్చే ఏడాది దేశంలో మళ్లీ కరెంట్ కష్టాలు..!!

ఇటీవల సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్(సీఈఏ) ఘన్‌శ్యామ్‌ ప్రసాద్‌ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.దేశంలో విద్యుత్ సరఫరా డిమాండ్ ఏప్రిల్ నాటికి 230-235 గిగ వాట్లకు పెరగవచ్చని అంచనా వేశారు.

 Next Year There Will Be Another Current Crisis In The Country, Power Crisis, Ce-TeluguStop.com

ప్రస్తుత డిమాండ్ 215 గిగా వాట్లతో పోలిస్తే ఇది తొమ్మిది శాతం ఎక్కువ.దీంతో వచ్చే ఏడాది దేశంలో చాల రాష్ట్రాలు కరెంటు సంక్షోభం ఎదుర్కోక తప్పదని పేర్కొన్నారు.

పరిస్థితి ఇలా ఉండగా తెలంగాణ మినహా మిగతా రాష్ట్రాలలో విద్యుత్ కోతలు ఉండే అవకాశం ఉందని తాజా లెక్కలు బట్టి వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో విద్యుత్ డిమాండ్ కి అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో చర్యలు తీసుకోవడంతో తెలంగాణలో పెద్దగా విద్యుత్ కష్టాలు ఉండవని సమాచారం.

Telugu Ceaghanshyam, Kcr-Telugu Political News

కాగా కేంద్ర ప్రభుత్వం ముందుచూపు కొరవడంతో.ఈ కరెంటు సంక్షోభం మళ్లీ వచ్చే ఏడాది ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.దేశంలో డిమాండ్ కి సరిపడా విద్యుత్ సరఫరాలో ముందస్తు ప్రణాళికలు కేంద్ర ప్రభుత్వం చేయకపోవడంతో వచ్చే ఏడాది కరెంటు సంక్షోభం తప్పదని…సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సీఈఏ) ఛైర్‌పర్సన్‌ ఘన్‌శ్యామ్‌ ప్రసాద్‌ ముందస్తుగా హెచ్చరించారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాలు అప్రమత్తమైతే ఈ సంక్షోభం నుండి తప్పించుకునే అవకాశం ఉందని మరో పక్క ప్రచారం జరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube