పెళ్లింట కరోనా కలకలం: పెళ్లి దంపతులతో సహా 42 మందికి పాజిటివ్...!

ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభణ చాపకింద నీరులాగా వ్యాప్తి చెందుతుంది.

కరోనా కట్టడి భాగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్న సరే ప్రజల ఆజాగ్రత్తల వల్ల కరోనా వ్యాధి మరింత ఉద్రిక్తంగా మారింది.

గతంలో ఢిల్లీలో జరిగిన ప్రార్థనలు ఇందుకు ఓ ఉదాహరణ.ఇలాంటి ఘటనలు జరిగిన కూడా, ప్రజలు అలాంటి నిర్లక్ష్యమే కొనసాగిస్తున్నారు.

కరోనా వైరస్ వ్యాధి అధికంగా ఉన్న సమయంలో కూడా శుభకార్యాలు, పెళ్లిళ్లు, వేడుకలు అంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఇక కొన్ని సంఘటనలు అయితే పెళ్లి వేడుకలలో వధువు వరుడు లకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిన సందర్బాలు కూడా ఉన్నాయి.

తాజాగా ఇలాంటి నిర్లక్ష్య ధోరణి కారణంగానే పెళ్లయిన కొత్త దంపతులతో పాటు కార్యక్రమానికి పాల్గొన్న 42 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవ్వడంతో .పెళ్లి ఇల్లు కాస్త హోమ్ ఐసోలేషన్ కేంద్రంగా మారిపోయింది.ఈ సంఘటన కేరళలో రాష్ట్రంలో జరిగింది.

Advertisement

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.కేరళలోని కాసరగోడ్ జిల్లా చెంగల గ్రామంలో ఇటీవల ఘనంగా ఓ వివాహ కార్యక్రమం నిర్వహించారు.

ఆ తర్వాత కొన్ని రోజులకు కుటుంబ పెద్ద ఒకరు వైరస్ లక్షణాలతో ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు.అతను కరోనా పరీక్షలు చూపించగా పాజిటివ్ అని తేలడంతో కుటుంబం మొత్తం ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

ఇక అతనికి కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అవడంతో, పెళ్ళికి వచ్చిన వారందరికీ కూడా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు.అందులో 42 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ జరిగింది.

వైరస్ సోకినా వారిలో మొత్తం 6 కుటుంబ సభ్యులతో పాటు నవదంపతులకు కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.వీరితో పాటు పెళ్లికి హాజరైన అన్ని కుటుంబాలను కూడా 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ ఉండాలని అధికారులు సూచించారు.

వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

Advertisement

తాజా వార్తలు