టీఆర్ఎస్‌లో నాలుగో ప‌వ‌ర్ సెంట‌ర్ రెడీ అయ్యిందా.!

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీలో మ‌రో ప‌వ‌ర్ సెంట‌ర్ రెడీ అయ్యిందా ?  సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత ఎమ్మెల్సీగా ఎన్నిక కావ‌డంతో ఇప్పుడు ఆమె కేంద్రంగా కూడా కొంత రాజ‌కీయం స్టార్ట్ అయ్యింది.

వాస్త‌వానికి క‌విత ఎంపీగా ఉన్న‌ప్పుడు నిజామాబాద్ జిల్లాతో పాటు ఉత్త‌ర తెలంగాణ‌లోకి కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆమె అనుచ‌ర‌గ‌ణం యాక్టివ్‌గా ఉండేది.

ఒకానొక ద‌శ‌లో క‌విత‌కు కేంద్ర మంత్రి ప‌ద‌వి అన్న టాక్ రావ‌డంతో క‌విత హ‌వా మామూలుగా ఉండేది కాదు.తెలంగాణ ఉద్య‌మం ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి క‌విత ఎంతో యాక్టివ్‌గా ఉన్నార‌న్న‌ది మాత్రం నిజం.

ఇక ఆమె ఎంపీగా ఓడిపోయాక రాజ‌కీయంగా యాక్టివ్‌గా లేక‌పోవ‌డం.మ‌రోవైపు కేటీఆర్ హ‌వా, అటు హ‌రీష్‌రావు కూడా త‌న వ‌ర్గం ప‌టిష్టం చేసుకోవ‌డం.

ఇటు కేసీఆర్‌కు ఎప్ప‌టి నుంచో ఉన్న పాత‌మిత్రుల నేప‌థ్యంలో ఎవ‌రి ప‌వ‌ర్ సెంట‌ర్ వారికి ఉంది.క‌విత ఎంపీగా ఓడిపోయాక ఆమె బ‌య‌ట‌కు రావ‌డం మానేయ‌డంతో ఆమె వ‌ర్గం కూడా కేటీఆర్‌, హ‌రీష్ రావుల చెంత‌కు చేరిపోయింది.

Advertisement

ఇక ఇప్పుడు క‌విత ఎమ్మెల్సీగా విజ‌యం సాధించ‌డంతో పాటు ఆమె బ‌య‌ట‌కు వ‌స్తే ఆమె ప్రొటోకాల్ ఆమెకు ఉండ‌డంతో పాటు పార్టీలోనూ గౌర‌వం ఉండ‌డంతో ఆమె వ‌ర్గం ఇప్పుడు మ‌ళ్లీ యాక్టివ్ అవుతోంది.తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప‌లువురు మ‌హిళా నేత‌లు ఇప్పుడు క‌విత ప్రాప‌కం కోసం పోటీ ప‌డుతున్నారు.

ఇక జాతీయ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషించేందుకు రెడీ అవుతోన్న కేసీఆర్ పార్టీని రాష్ట్ర స్థాయిలో పూర్తిగా కుమారుడు కేటీఆర్‌,  మేన‌ళ్లుడు హ‌రీష్‌, కుమార్తె క‌విత చేతుల్లో పెట్టేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నార‌ని అంటున్నారు.ఇక ఇప్పుడు క‌విత‌కు రాష్ట్ర స్థాయిలో పార్టీ ప‌రంగా మ‌రింత కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే టీఆర్ఎస్‌లో నాలుగో ప‌వ‌ర్ సెంట‌ర్ మ‌రింత స్ట్రాంగ్ అవ్వ‌డంతో పాటు టీఆర్ఎస్ రాజ‌కీయాలు మ‌రింత ఆస‌క్తిగా మార‌డం ఖాయం.

Advertisement

తాజా వార్తలు