ఈ వన్డే వరల్డ్ కప్ టోర్నీలో సీనియర్ ఆటగాళ్లకు ఏమాత్రం తగ్గకుండా జూనియర్ ఆటగాళ్లు మెరుపు ఇన్నింగ్స్ ఆడి అందరిని ఆశ్చర్యపరిచారు.జట్టు గెలుపు కోసం చివరి వరకు అద్భుత పోరాటం చేసిన యువ ఆటగాళ్లు ఎవరో ఒకసారి చూద్దాం.
న్యూజిలాండ్ జట్టు వరుసగా నాలుగు మ్యాచ్లలో విజయాలను సాధించి దాదాపుగా సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది.న్యూజిలాండ్ జట్టులోకి బ్యాట్స్ మెన్ గా, స్పిన్నర్ గా ఎంట్రీ ఇచ్చిన రచిన్ రవీంద్ర( Rachin Ravindra ) న్యూజిలాండ్ జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు.
రవీంద్ర స్పిన్నర్ గా జట్టులోకి ఎంట్రీ ఇచ్చి.నెంబర్ త్రీ బ్యాట్స్ మెన్ గా అవతరించి ఈ టోర్నీలో అద్భుతమైన మూడు సెంచరీలు చేశాడు.ఇక ఇప్పటివరకు 9 మ్యాచులు ఆడిన రవీంద్ర 3 సెంచరీలు, రెండు అర్థ సెంచరీలతో 565 పరుగులు చేశాడు.బౌలింగ్ విషయానికి వస్తే.
ఒత్తిడిని కంట్రోల్ చేసుకుంటూ అద్భుతమైన పర్ఫామెన్స్ లను ఇస్తున్నాడు.ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్లేయర్ ఇబ్రహీం జద్రాన్( Ibrahim Zadran ) తమ జట్టు తరఫున వరల్డ్ కప్ లో సెంచరీ చేసిన ఒకే ఒక ప్లేయర్ గా రికార్డ్ సృష్టించాడు.
ఆడిన 9 మ్యాచ్లలో 376 పరుగులు చేశాడు.ఇక పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో 87 పరుగులు చేసి జట్టు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన మరో ప్లేయర్ అజ్మతుల్లా ఉమర్ జాయ్( Azmatullah Omarzai ) అద్భుతమైన మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ ఈ టోర్నీలో మూడు అర్థ సెంచరీలను నమోదు చేసుకుని కీలక సమయంలో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.సౌత్ ఆఫ్రికా జట్టుకు చెందిన మర్కో జాన్సన్( Marco Jansen ) ఈ వన్డే వరల్డ్ కప్ లో అద్భుతమైన మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సౌత్ ఆఫ్రికా జట్టు సెమీఫైనల్ చేరడంలో ఇతని కీలకపాత్ర ఉందని చెప్పాలి.ఆడిన ఎనిమిది మ్యాచ్లలో బౌలర్ గా ఏకంగా 17 వికెట్లు తీశాడు.మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు వచ్చి 157 పరుగులు చేశాడు.ఇతను సీనియర్ ప్లేయర్లకు ఏమాత్రం తీసిపొడనే చెప్పాలి.

శ్రీలంక జట్టు ఈ టోర్నీలో కేవలం రెండు మ్యాచ్ లలో మాత్రమే గెలిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది.అయితే ఈ జట్టు ఆటగాడు దిల్షన్ మధు శంక( Dilshan Madushanka ) అద్భుత ఆటను ప్రదర్శించాడు.ఆడిన 9 మ్యాచ్ లలో ఏకంగా 21 వికెట్లు తీశాడు.ఈ టోర్నీలో భారత్ తో ఆడిన మ్యాచ్ లో ఏకంగా ఐదు వికెట్లు తీసుకున్నాడు.శ్రీలంక జట్టు పూర్తిగా విఫలం అయిన మధు శంక మాత్రం తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.







