తెలంగాణలో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం..!!

తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది.ఈ మేరకు సర్కార్ ను ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ సిద్ధం అయింది.

ఇందులో భాగంగా మరికాసేపటిలో సీఎల్పీ సమావేశం కానుంది.ఎమ్మెల్యేలు సమావేశమై సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు.

ఇప్పటికే గెలిచిన ఎమ్మెల్యేలు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ హోటల్ కు చేరుకున్నారని తెలుస్తోంది.మరోవైపు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను కలిసిన నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు.

సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డి పేరు వినిపిస్తోంది.తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకోవడానికి, అధికారంలోకి రావడంలో రేవంత్ రెడ్డి పాత్ర ముఖ్యమైనదని.

Advertisement

ఈ క్రమంలోనే ఆయనకు ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పజెప్పాలని యోచనలో ఉన్నారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

కుదరని పక్షంలో ఈనెల 6న ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగే ఛాన్స్ ఉంది.కాగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు