హుజూరాబాద్‌లో ఓడిపోయినా ప‌ర్వాలేద‌ట‌.. కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

టీఆర్ఎస్ పార్టీని ఎప్పుడైతే ఈట‌ల రాజేంద‌ర్ వీడారో అప్ప‌టి నుంచే హుజూరాబాద్ ఉప ఎన్నిక తెర‌మీద‌కు వ‌చ్చిన సంగ‌తి తెల‌సిందే.

కాగా ఇక్క‌డ గెలించేదుకు టీఆర్ ఎస్ పార్టీ ఎన్ని విధాలుగా ప్ర‌య‌త్నిస్తుందో అంద‌రికీ తెలిసిందే.

ఓ వైపు బీజేపీ నుంచి బ‌ల‌మైన నేత‌గా ఈట‌ల రాజేంద‌ర్ నిల‌బ‌డ‌టంతో ఆయ‌న్ను ఓడించ‌డం చాలా క‌ష్ట‌మ‌ని టీఆర్ఎస్ భావించి ఎలాగైనా గెల‌వాల‌నే ప‌ట్టుమీద ఉంది.గ‌త చర‌త్ర‌లో ఒక్క ఉప ఎన్నిక కోసం ఏ నాడు ఏ స్కీమ్ పెట్ట‌ని కేసీఆర్ ఇప్పుడు ఏకంగా ద‌ళిత బంధు లాంటి సంచ‌ల‌న ప‌థ‌కానికి తెర లేపారు.

ఇంకోవైపు వందల కోట్లు కుమ్మ‌రిస్తూ హుజూరాబాద్‌లో డెవ‌ల‌ప్ మెంట్ ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ పెడుతున్నారు.ఇక రాష్ట్రంలో ఎక్క‌డా లేని విధంగా కొత్త పింఛ‌న్లు లేదంటే కొత్త రేష‌న్ కార్డులు కూడా ఇక్క‌డే ఇప్పిస్తున్నారు.

ఇక మండ‌లాల నుంచి చాలామందిని త‌మ పార్టీలో చేర్చుకుంటున్నారు.ఇప్ప‌టికే కౌశిక్ రెడ్డిన కాంగ్రెస్ బ‌రిలో నుంచి త‌ప్పించి ఎమ్మెల్సీ టికెట్ కూడా ఇచ్చారు.

Advertisement

ఇక నామినేటెడ్ ప‌ద‌వులు కూడా హుజూరాబాద్ కే ఇస్తున్నారు.మండ‌లానికో మంత్రిని పెట్టి మ‌రీ ఇంటింటి ప్ర‌చారాలు నిర్వ‌హిస్తున్నారు.

మంత్రి హ‌రీశ్ రావు ద‌గ్గ‌రుండి మ‌రీ రాజ‌కీయాల‌ను చూసుకుంటున్నారు.మ‌రి ఇన్ని చేస్తున్న‌ప్పుడు గెలుపు మీద ఎంత ధీమాతో మాట్లాడాలి.అలాంటిది పార్టీని న‌డిపిస్తున్న కేటీఆర్ మాత్రం ఇప్పుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

హుజూరాబాద్ లో ఓడిపోయినంత మాత్రాన త‌మ అధికారం మాత్రం పోద‌ని చెప్పారు.నిన్న పార్టీ మీటింగ్ లో ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం ఇప్పుడు సంచ‌ల‌నం రేపుతోంది.

ఒక మంత్రిగా అలాగే పార్టీని న‌డిపిస్తున్న నాయ‌కుడే ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం ఏంట‌ని అంతా షాక్ అవుతున్నారు.అంటే ఓడిపోతామ‌నే భ‌యంలో టీఆర్ ఎస్ ఉందా అనే అనుమానాలు క‌లుగుతున్నాయి.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు