కరోనా ముందు కరోనా తరువాత ప్రపంచ వ్యాప్తంగా ప్రజల జీవన విధానం తలకిందులు అయ్యింది.ఆర్ధికంగా ఎన్నో కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి,ఉద్యోగాలు లేక రోడ్డున పడ్డాయి.
ఈ పరిస్థితి అగ్ర రాజ్యం అమెరికాలో మరింత తీవ్రంగా మారింది.ఉద్యోగాలు లేకపోవడంతో సామాన్యులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు.
చేతిలో చిల్లిగవ్వలేక పోవడంతో కుటుంబాన్ని పోషించలేని పరిస్థితులలో ప్రభుత్వం ఇచ్చే నిరుద్యోగ బృతి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎదురయ్యింది.
ఇక అద్దె ఇళ్ళలో ఉండే వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
అద్దె కట్టేందుకు డబ్బులు లేకపోవడంతో కుటుంబంతో కలిసి రోడ్లపై ఉండాల్సి వస్తోంది.మరో పక్క ఇంటి యజమానులు అద్దెలు అమాంతం పెంచేయడంతో చేసేది లేక రోడ్డుపక్క చెట్ల కిందకు చేరుకుంటున్నారు.
ఈ క్రమంలో అద్దె తక్కువగా ఉండే ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారు.కాలిఫోర్నియా రాష్ట్రంలోని ప్రేస్నో అనే నగరం మధ్య, దిగువ తరగతి వాళ్ళు నివాసం ఉండేందుకు అనువైన ప్రాంతం.
దాంతో ప్రధాన నగరాలలో అద్దెలు భరించలేక ఇళ్ళు ఖాళీలు చేస్తున్న వారందరూ ప్రేస్నో నగరానికి క్యూలు కడుతున్నారు.ప్రేస్నో లో ఎక్కువగా నివసిన్చేంది మెక్సికో నుంచీ వలస వచ్చిన వారు కావడం విశేషం.
అయితే వరుసగా ప్రేస్నో కు అమెరికన్స్ క్యూ కట్టడంతో నగర వాసులు సైతం అద్దె రెట్లు పెంచేయడం మొదలు పెట్టారు.కరోనా తరువాత తమ పరిస్థితులు కూడా బాలేదని ఈ అద్దె డబ్బులే మాకు ఆధారం అవుతున్నాయాంటూ రెట్లు పెంచేయడంతో ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు అమెరికన్స్.
ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతూ పరిస్థితులు అదుపులోకి వచ్చినా అద్దెలు మాత్రం తగ్గించడం లేదంటూ వాపోతున్నారు ప్రేస్నో నగరానికి పెద్ద ఎత్తున వలసలు రావడంతో అక్కడి భూముల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయని అంటున్నారు స్థానికులు.ఇదిలాఉంటే అమెరికా చరిత్రలో ఇలాంటి రోజు ఎన్నడూ చూడలేదని, ప్రస్తుతం మధ్య తరగతి ప్రజల పరిస్థితి మరింత దుర్భరంగా మారిందని అంటున్నారు పరిశీలకులు.