నయనతార సినిమాను తెలుగులో ఆమెతో చేస్తారట!

టాలీవుడ్‌లో రీమేక్ చిత్రాలకు ఉండే ఫాలోయింగ్ వేరు.ఆ సినిమాల్లో కథ కరెక్ట్‌గా ఉందంటే అందులో ఎవరు నటంచారనే సంబంధం లేకుండా ఆ సినిమాకు అదిరిపోయే విజయాన్ని కట్టబెడతారు.

 Netrikann To Be Remade In Telugu With Anushka, Netrikann, Nayanthara, Anushka Sh-TeluguStop.com

ఇక ఇటీవల తమిళంలో వచ్చే సినిమాలన్నీ కూడా తెలుగులో నేరుగా డబ్బింగ్ అయ్యి వస్తున్నాయి.అయితే తాజాగా తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన ‘నేత్రికన్’ చిత్రం నేరుగా డిస్నీ హాట్‌స్టార్‌లో రిలీజ్ అయ్యింది.

ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు దర్శకనిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ‘నేత్రికన్’ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేసేందుకు పలువురు ఆసక్తిని చూపుతున్నారు.

కంటిచూపు లేని పాత్రలో నయన్ యాక్టింగ్‌కు ప్రేక్షకులు పెద్దఎత్తున పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వడంతో, తెలుగులో కూడా ఈ పాత్రను అలాంటి స్టార్ బ్యూటీతోనే చేయించాలని చూస్తున్నారట.ఇప్పటికే ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను ఓ ప్రముఖ సంస్థ సొంతం చేసుకోగా, ఈ రీమేక్ చిత్రంలో స్టార్ బ్యూటీ అనుష్కను నటింపజేసేలా వారు ప్రయత్నం చేస్తున్నారట.

త్వరలోనే అనుష్కను కలిసి ఈ మేరకు సినిమా డీల్‌ను ఫిక్స్ చేయాలని సదరు చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

మొత్తానికి తమిళ తంబీలను విశేషంగా ఆకట్టుకున్న ‘నేత్రికన్’ చిత్రాన్ని తెలుగులో ఎవరు తెరకెక్కిస్తారు, ఈ సినిమాను ఎవరు ప్రొడ్యూస్ చేస్తారనే అంశాలు పక్కనబెడితే, నయనతార చేసిన పర్ఫార్మెన్స్‌ను అనుష్క శెట్టి ఎలా చేస్తుందా అనే ఆసక్తి ఇప్పుడు చిత్రపురిలో చర్చనీయాంశంగా మారింది.

ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే ఉండబోతున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.గతంలో నిశ్శబ్ధం చిత్రంలో చెవిటి అమ్మాయిలా కనిపించిన అనుష్క, తన నెక్ట్స్ మూవీలో కళ్లు లేని పాత్రలో కనిపించనుంది.

మరి ఈ సినిమా అనౌన్స్‌మెంట్ ఎప్పుడు ఉంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube