వీధి కుక్కకి సెక్యూరిటీ జాబ్ ఇవ్వాలని నెటిజన్లు ఇండియన్ రైల్వేకి రిక్వెస్ట్.. ఎందుకంటే..

కుక్కలు( Dogs ) మనుషులకు అనేక పనులలో సహకరిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.సహాయకరంగా నిలుస్తున్న ఈ కుక్కలకు సంబంధించిన వీడియోలు ఎన్నో ఇప్పటికే సోషల్ మీడియా( Social Media )లో వైరల్ గా మారాయి.

 Netizens Wants Indian Railways To Give Stray Dog A Security Job Viral,,viral Vid-TeluguStop.com

తాజాగా రైల్వే స్టేషన్‌లో రైళ్ల పక్కనే తిరుగుతున్న ఓ వీధికుక్క( Street Dog )కి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.రైలులోంచి ప్రమాదకర రీతిలో బయటకు వేలాడుతూ ప్రయాణిస్తున్న కొంతమంది ప్రయాణికులను ఇది కరుస్తున్నట్లు బెదిరిస్తోంది.

లోపలికి వెళ్ళమన్నట్లు అరుస్తోంది.ఎందుకంటే ఇలాంటి ప్రయాణం చాలా ప్రమాదకరమైనది, ప్రాణాలు పోవడానికి కారణం కూడా కావచ్చు.

ఈ వీడియోను ఐఆర్‌ఏఎస్ అధికారి అనంత్ రూపనగుడి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

రైలు ఫుట్‌బోర్డ్‌( Railway Footboard )పై ప్రయాణించడం ఎంత ప్రమాదకరమో దీని ద్వారా చూపించాలనుకున్నారు.అతను వీడియోకు క్యాప్షన్‌గా “ఫుట్ బోర్డ్ ట్రావెలింగ్‌కి వ్యతిరేకంగా డ్రైవ్‌లో అందించబడిన బెస్ట్ అసిస్టెన్స్ ఈ కుక్క” అని రాశారు.కుక్క వింత ప్రవర్తనతో ప్రయాణికులు తమ తప్పు తెలుసుకుని రైలు లోపలికి వెళ్లేలా చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ వీడియోను 2 లక్షల దాకా వ్యూస్ వచ్చాయి.కుక్క అలా ఎందుకు చేస్తుందో చాలా మంది ఆశ్చర్యపోయారు.ప్రమాదం గురించి హెచ్చరిస్తూ ప్రయాణికులను ఆదుకునేందుకు కుక్క ప్రయత్నిస్తోందని కొందరు భావించారు.ఈ కుక్కకు సెక్యూరిటీ జాబ్( Security Job) ఇవ్వాలని ఇండియన్ రైల్వేని కొందరు రిక్వెస్ట్ కూడా చేశారు.


మరికొందరు రైలుకు దగ్గరగా పరిగెత్తడం వల్ల కుక్క గాయపడుతుందేమో అని ఆందోళన చెందారు.రైలు చాలా రద్దీగా ఉన్నప్పుడు లేదా థ్రిల్ కోసం ఫుట్‌బోర్డ్ ప్రయాణం చేస్తారు.కానీ ఇది చాలా మూర్ఖత్వపు చర్య, ఇది తీవ్రమైన గాయాలు లేదా మరణాలకు దారి తీస్తుంది.ఫుట్‌బోర్డ్ ప్రయాణం వల్ల చాలా మంది ప్రాణాలు లేదా అవయవాలను కోల్పోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube