Anchor Ravi: బాత్రూంలో స్నానం చేస్తున్న వీడియో పంచుకున్న యాంకర్ రవి.. ఏదో తేడాగా ఉందంటూ ట్రోల్స్?

Netizens Trolls On Anchor Ravi Bathroom Video

టాలీవుడ్ బుల్లితెరపై యాంకర్ గా ఒక గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి యాంకర్ రవి( Anchor Ravi ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తన యాంకరింగ్ తో మంచి అభిమానం సంపాదించుకొని బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు రవి.

 Netizens Trolls On Anchor Ravi Bathroom Video-TeluguStop.com

కేవలం బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా నటుడుగా పరిచయమయ్యాడు.సోషల్ మీడియాలో కూడా ఫుల్ ఎనర్జీగా కనిపిస్తాడు.

యాంకర్ రవి తొలిసారిగా సంథింగ్ స్పెషల్ షో( Something special show ) ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.ఇక ఈ షోలో తన మాటలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.

ఆ తర్వాత వన్ షో, డీ జూనియర్స్, ఫ్యామిలీ సర్కస్, పటాస్ వంటి ఎన్నో ఎంటర్టైన్మెంట్స్ షో లలో యాంకర్ గా చేసి మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు.పలు సినీ ఈవెంట్లలో కూడా యాంకర్ గా చేశాడు.

ఇక తనకు బుల్లితెర పై క్రేజ్ ఎక్కువగా ఉండటంతో ఏకంగా బిగ్ బాస్ సీజన్ 5 లో( BB 5 ) అవకాశం అందుకున్నాడు.

ఇక ఈ షోలో యాంకర్ రవి కాస్త నెగిటివిటీ ని కూడా సంపాదించుకున్నాడు.హౌస్ లో ఉన్నంతకాలం బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నాడు.చాలా వరకు యాంకర్ రవి టైటిల్ విన్నర్ గా గెలుస్తాడని అనుకున్నారు.

కానీ టాప్ ఫైవ్ లో కూడా ఉండలేకపోయాడు.ఇక హౌస్ నుండి బయటకు వచ్చాక రవి చేసిన హంగామా అందరికీ తెలిసిందే.

తనపై ట్రోల్స్, మీమ్స్, కామెంట్లు చేసిన వారిపై దగ్గరుండి చర్యలు తీసుకున్నాడు.ఇక యాంకర్ రవికి నిత్య అనే అమ్మాయితో పెళ్లి జరగగా వాళ్లకి వియా అనే పాప కూడా ఉంది.

ఇక వీరిని సోషల్ మీడియా వేదికగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు యాంకర్ రవి.వాళ్ళు కూడా బుల్లితెరపై పలు షోలలో వచ్చి బాగా సందడి చేశారు.రవి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కూడా తన భార్య, బిడ్డ రాగా ఆ ఎపిసోడ్ మాత్రం బాగా హైలెట్ గా మారింది.

రవి సోషల్ మీడియాలో కూడా ఫుల్ బిజీ గా మారాడు.నిత్యం ఏదో ఒక పోస్ట్ తో బాగా సందడి చేస్తూ ఉంటాడు.పైగా తన కూతురుతో చేసిన అల్లర్ల వీడియోలు కూడా పంచుకుంటాడు.

అప్పుడప్పుడు బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటాడు.కొన్నిసార్లు ఆ ట్రోల్స్ పై బాగా ఫైర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక స్టోరీ పంచుకున్నాడు రవి.ఇక అందులో రవి బాత్రూమ్ లో టబ్ లో స్నానం చేస్తున్నట్లు కనిపించాడు.ఇక అందులో నీళ్లల్లో ఆడుతున్నట్లు కనిపించాడు.అంతేకాకుండా ఆ స్టోరీకి ఇది రిలాక్స్ సమయం అంటూ పంచుకున్నాడు.దీంతో ఆ వీడియో చూసి నెటిజన్స్ అమ్మాయిలే కాకుండా అబ్బాయిలు కూడా బాత్రూం వీడియోలు పంచుకుంటున్నారా అంటూ.ఏదో తేడా కొడుతుంది అంటూ బాగా ట్రోల్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.

https://instagram.com/stories/anchorravi_offl/3071506399813355606?igshid=MDJmNzVkMjY=

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube