అల్లు ఫ్యామిలీ అంటే ఆ నలుగురేనా? అల్లు స్నేహ పెట్టిన ఫోటోపై నెటిజన్స్ ట్రోల్స్?

తెలుగు సినీ ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇక ఈ ఫ్యామిలీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి హోదా ఉంది.

ముఖ్యంగా అల్లు అర్జున్ మాత్రం స్టార్ హీరోగా ఎదిగి తమ ఫ్యామిలీ గౌరవాన్ని నిలబెట్టాడు.ఇక అల్లు అర్జున్ కు ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీ అంటే అందరూ గుర్తుకు వస్తారు.కానీ తాజాగా అల్లు అర్జున్ భార్య స్నేహ చేసిన పోస్టులో అల్లు ఫ్యామిలీ అంటూ తన ఫ్యామిలీ మెంబర్స్ ను మాత్రమే పంచుకోవడంతో అందరూ తనపై బాగా ట్రోల్స్ చేస్తున్నారు.

ఇంతకూ అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా నిలిచి ఓ రేంజ్ లో దూసుకుపోతున్న అల్లు అర్జున్ గురించి అందరికీ తెలిసిందే.

Advertisement

గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్ కు ఈ సినిమా మంచి గుర్తింపు అందించింది.తొలి నటనతోనే మంచి సక్సెస్ అందుకోవడంతో ఆ తర్వాత మంచి మంచి బ్లాక్ బస్టర్ హిట్ మూవీలో స్టార్ గా ఎదిగాడు.

ఇక ఈయన మంచి స్టార్ హోదాలో ఉన్న సమయంలో 2011లో స్నేహ రెడ్డి ని పెళ్లి చేసుకున్నాడు.వీరికి ఒక కూతురు, ఒక కొడుకు కూడా ఉన్నారు.

ఇక అల్లు అర్జున్ సినిమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తాడో.కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాడు.

తనకు సినిమా షూటింగ్ సమయంలో కాస్త బ్రేక్ దొరికితే చాలు వెంటనే ఫ్యామిలీతో లగేజ్ సర్దుకొని విదేశ ప్రయాణాలు చేస్తాడు.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?

కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతూ మంచి భర్తగా, మంచి తండ్రిగా నిలిచాడు.టాలీవుడ్ ఇండస్ట్రీలో స్నేహ రెడ్డి, అల్లు అర్జున్ ల జంట క్యూట్ కపుల్ గా నిలిచింది.ఇప్పటికీ ఈ జంట ఎంతో అన్యోన్యంగా, ప్రేమగా కనిపిస్తుంటారు.

Advertisement

ఇక అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా తెలుగు ప్రజలతో మంచి పరిచయాన్ని పెంచుకుంది.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం తో విపరీతమైన అభిమానులను సంపాదించుకుంది.

అంతేకాకుండా కొన్ని రోజుల కిందట సోషల్ మీడియా కు సంబంధించిన సర్వేలో స్నేహ రెడ్డి మొదటి స్థానంలో నిలిచింది.ఏ స్టార్ హీరోల భార్యలు, స్టార్ హీరోయిన్ లు కూడా అందుకొని గుర్తింపును సొంతం చేసుకుంది.

తన పిల్లలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా పంచుకుంటుంది.అంతేకాకుండా అల్లు అర్జున్ కి సంబంధించిన సినిమా అప్ డేట్ లను, ఫోటోలను, పిల్లలతో సరదాగా ఆడుతున్న వీడియోలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.మొత్తానికి అల్లు అర్జున్ కుటుంబం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి అభిమాన కుటుంబంగా అభిమానులకు దగ్గరయింది.

ఇదిలా ఉంటే తాజాగా స్నేహ రెడ్డి తన ఇన్ స్టాలో ఒక పోస్ట్ షేర్ చేసుకుంది.అల్లు ఫ్యామిలీ అంటూ తన పేరుతో పాటు తన భర్త పిల్లల పేర్లు కూడా పంచుకుంది.

ఆ పోస్ట్ వైరల్ అవడంతో అది చూసిన నెటిజెన్స్.ఫ్యామిలీ అంటే మీ నలుగురు మాత్రమే ఉంటారా అంటూ తనపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

తాజా వార్తలు