సోషల్ మీడియాను వాడే కొందరు నెటిజన్స్ ఇతరులను బాగా టార్గెట్ చేస్తూ ఉంటారు.ప్రతి విషయంలో వారిని ఎలా టార్గెట్ చేయాలా అని చూస్తూ ఉంటారు.
ముఖ్యంగా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీల విషయంలో మాత్రం ఎప్పుడు ఏదో ఒక వివాదాన్ని సృష్టించాలని అనుకుంటారు.ఇక వాళ్ళు ఏదైనా ఫోటోలను షేర్ చేస్తే చాలు.
వెంటనే వాటిపై ట్రోల్స్ చేస్తుంటారు.ఇప్పటికే చాలామంది నటీనటులను బాగా ట్రోల్స్ చేశారు ట్రోలర్స్.
కొన్ని కొన్ని సార్లు ట్రోల్స్ బాగా ఎదురవటంతో సెలబ్రెటీలు వారికి గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు.అయినా కూడా ట్రోలర్స్ మాత్రం వారిని వదలరు.
వారిని ఇంకా మరింత టార్గెట్ చేస్తుంటారు.ఇక హీరోయిన్ల బాడీ షేప్ ల గురించి బాగా కౌంటర్స్ వేస్తూ ఉంటారు.
కేవలం హీరోయిన్లనే కాకుండా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తో ఉన్న ఎవరినైనా కూడా బాడీ షేమింగ్ చేస్తూ వారిని బాగా బాధ పెడుతుంటారు.
ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా.
అటువంటి ట్రోల్స్ సింగర్ గీతామాధురి కూడా ఎదుర్కొంది.ఇంతకు అసలేం జరిగిందో తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సింగర్ గీతామాధురి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.గీతా మాధురి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తన గొంతుతో ఎంతోమందిని అభిమానులుగా మార్చుకుంది.పైగా తన పాటలకు ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది.
బుల్లితెరపై కూడా తన పాటలతో ప్రేక్షకులను అలరించింది.పలు రియాలిటీ షో లలో కూడా పాల్గొంది.ఇక బిగ్ బాస్ హౌస్ లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొని మరింత పరిచయాన్ని పెంచుకుంది.ఇక ఈమె నటుడు నందును పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
గతంలో ఈమె నందు కలిసి అదితి అని ఒక షార్ట్ ఫిలిం లో నటీనటులుగా చేశారు.
దీంతో ఆ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారటంతో ఇద్దరి కుటుంబ సమక్షంలో వీరి ప్రేమ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
ఇక వీరికి ఒక కూతురు.ఇక గీత మాధురి యాంకర్ గా కూడా పలు షో లలో చేసింది.
ఈమె కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.
నందు కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటాడు.ఇక వీరిద్దరూ తమ కూతురు తో కలిసి చేసే వీడియోలు బాగా హైలెట్ గా ఉంటాయి.తమ వ్యక్తిగతకు సంబంధించిన విషయాలే కాకుండా ఫ్యామిలీ ఫోటో లను కూడా బాగా షేర్ చేసుకుంటారు.
ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా గీతామాధురి ఒక ఈవెంట్ లో సంబంధించిన తన ఫోటోను పంచుకుంది.
అందులో గీతామాధురి హెయిర్ స్టైల్ అంతగా ఆకట్టుకోలేకపోయింది.
దీంతో చాలామంది తన హెయిర్ స్టైల్ గురించి కామెంట్లు చేశారు.అయితే మరో నెటిజన్.
ముందు బరువు తగ్గండి అంటూ ట్రోల్ చేయగా.ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ అయింది.
మరి ఈ కామెంట్ గురించి గీతామాధురి ఏమని స్పందిస్తుందో చూడాలి.