Annapoornamma Chinmayi : అర్ధరాత్రి ఆడపిల్లలకు ఏం పనంటూ అన్నపూర్ణమ్మ కామెంట్స్.. చిన్మయి కౌంటర్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!

ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలలో చాలామంది వివాదాలలో చిక్కుకుంటున్నారు.చేసిన కామెంట్ల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.

సీనియర్ నటి అన్నపూర్ణమ్మ( Annapoornamma ) వయస్సు పెరుగుతున్నా ఇప్పటికీ వరుసగా సినిమాలలో, టీవీ షోలలో సందడి చేస్తూ అభిమానులకు దగ్గరవుతున్నారు.ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ అర్ధరాత్రి స్వతంత్రం అనగానే అరోజుల్లో ఆడవాళ్లు బయటకు వచ్చేశారా అని అన్నారు.

ఆడదానికి ఎందుకు స్వాతంత్రం కావాలని ఆమె అన్నారు.రాత్రి 12 గంటల తర్వాత అమ్మాయిలకు( Women ) ఏం పని అంటూ ఆమె ప్రశ్నించడం గమనార్హం.

ఇప్పుడు ఎక్స్ పోజింగ్ ఎక్కువైపోయిందని ఎవరూ మనల్ని ఏమీ అనొద్దు అనుకున్నా అందరూ మనల్ని ఏదోటి అనేట్లుగా రెడీ అవుతున్నామని అన్నపూర్ణమ్మ చెప్పుకొచ్చారు.మనవైపు కూడా కొంచెం ఉంటుందని ఆమె వెల్లడించారు.

Advertisement

ఆ కామెంట్ల గురించి చిన్మయి( Chinmayi ) స్పందిస్తూ నేను ఆమెకు పెద్ద అభిమానినని ఆమె ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తపరుస్తుంటే నా గుండె ముక్కలైనట్లు అనిపిస్తోందని పేర్కొన్నారు.ఫేవరెట్ అనుకునే వాళ్లు ఇలా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నానని ఆమె కామెంట్లు చేశారు.ఆమె ఆలోచనల ప్రకారం హెల్త్ ఎమర్జెన్సీ( Health Emergency ) అయినా సూర్యోదయం సూర్యాస్తమయం మధ్యలోనే జరగాలని ఆ తర్వాత లేడీ డాక్టర్స్, నర్సులు ఉండకూడదని ఆమె చెప్పుకొచ్చారు.

భారత్ లో అమ్మాయిలుగా పుట్టడం మన కర్మ అని చిన్మయి వెల్లడించారు.

అయితే నెటిజన్లు మాత్రం జనరేషన్ జనరేషన్ కు ఆలోచనల్లో మార్పు ఉంటుందని ఎవరినీ తప్పు పట్టాల్సిన అవసరం లేదని కామెంట్లు చేస్తున్నారు.అన్నపూర్ణమ్మ, చిన్మయి వాళ్ల వాళ్ల ఆలోచనాశైలి ప్రకారం కరెక్టేనని ఎవరో ఒకరిని నిందించాల్సిన అవసరం అయితే లేదని నెటిజన్లు చెబుతున్నారు.చిన్మయి రియాక్షన్ గురించి అన్నపూర్ణమ్మ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

ఈ వివాదం ఇక్కడితో ఆగిపోతే మంచిదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?
Advertisement

తాజా వార్తలు