సోషల్ మీడియా స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ గురించి అందరికీ పరిచయమే.సోషల్ మీడియా ద్వారా పరిచయమైన షణ్ముఖ్ ఒక స్టార్ హీరోకు ఉన్నంత ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు.
ఈయన ఇంత క్రేజ్ కు ఎదగడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.ఒక సామాన్య వ్యక్తి అయిన ఇతడు తన డాన్స్ వీడియోలతో, వెబ్ సిరీస్ లతో స్టార్ గా మారాడు.
ఒకప్పుడు ఈయన పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా హై రేంజ్ లో దూసుకెళ్లింది.హీరోలు సైతం ఈయన వెబ్ సిరీస్ లకు ఫిదా అయ్యారు.యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో తన కెరియర్ మొదలుపెట్టి తక్కువ సమయంలో మంచి సక్సెస్ అందుకొని యూట్యూబ్ స్టార్ గా నిలిచాడు.అంతేకాకుండా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.
పైగా రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొని మరింత పరిచయం పెంచుకున్నాడు.కానీ ఈ షో ద్వారానే నెగిటివిటీని కూడా సొంతం చేసుకున్నాడు షణ్ముఖ్.
నిజానికి ఈయన బిగ్ బాస్ లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.ఏకంగా తన మంచి జీవితానికి.చెరుగని మచ్చ ముద్రించుకున్నాడు.బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతకాలం మరో కంటెస్టెంట్ సిరి తో ఆయన ఎలా గడిపాడో చూసాం.
అప్పటికే షన్నుకు మరో సోషల్ మీడియా స్టార్ దీప్తి సునయన తో మంచి ప్రేమ రిలేషన్ ఉన్నప్పటికీ కూడా అతడు బిగ్ బాస్ హౌస్ లో మరో అమ్మాయితో బాగా రెచ్చిపోయాడు.
దీప్తి తో షన్ను ప్రేమలో ఉన్నప్పుడు పలు షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ చేసి మరింత గుర్తింపు తెచ్చుకున్నారు.పైగా బుల్లితెరపై ప్రసారమైన పలు షోలలో కూడా పాల్గొని బాగా సందడి చేశారు.నిజానికి ఈ జంటని చూస్తే చాలు లవ్ చేసుకునే కపుల్స్ ఇంత క్యూట్ గా ఉంటారా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోయారు.
వీరు త్వరలో పెళ్లి చేసుకుంటారు అని కూడా వార్తలు వినిపించాయి.
కానీ షణ్ముఖ్ బిగ్ బాస్ లో సిరి తో చేసిన రాద్ధాంతం వల్ల.
పూర్తిగా అతడికి దూరంగా ఉండటం మంచిది అని ఫిక్స్ అయింది దీప్తి.దీంతో అతడు హౌస్ నుండి బయటికి రాగానే అతడికి బ్రేకప్ చెప్పేసింది.
ఇక వీరి బ్రేకప్ ని చాలామంది అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.ఇప్పటికీ వీరిద్దరి బ్రేకప్ ను తట్టుకోలేకపోతున్నారు తమ ఫ్యాన్స్.
సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు కలవండి అంటూ కామెంట్లు పెడుతూ ఉంటారు.కానీ ఇద్దరు ఎవరి దారి వాళ్ళు అన్నట్లుగా ఉన్నారు.అయితే తాజాగా షన్ను ఒక డాన్స్ వీడియో పంచుకోగా ప్రస్తుతం అది బాగా వైరల్ అయింది.అయితే అందులో తను డాన్స్ చేస్తుండగా తన షూ లేస్ ఊడిపోవడంతో అది గమనించిన ఓ నెటిజన్ లేస్ ఊడిపోయాయి అంటూ తెలిపాడు.
దానికి షన్ను.జీవితంలో చాలా ఊడిపోయాయి.లేసులో ఏముందిలే తమ్ముడు అంటూ కామెంట్ పెట్టాడు.ఇక ఈ కామెంట్ వైరల్ అవ్వడంతో ఇదంతా దీప్తి సునైనను ఉద్దేశించి పెట్టాడు అని అనుకుంటున్నారు.