ఈ విచిత్రమైన టాయిలెట్‌ను చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. వీడియో వైరల్..

ప్రపంచంలో ఒక్కక్కరికి ఒక్కొక్క అభిరుచి ఉంటుంది.అయితే కొందరు హాబీల గురించి తెలుసుకుంటే షాక్ అవ్వక తప్పదు.

ఈ వింత హాబీల గురించిన వీడియోలు కొన్ని ఇప్పటికే వైరల్ అయి అందర్నీ నివ్వెరపరిచాయి.అలాంటి ఒక విచిత్రమైన హాబీ గల వ్యక్తి ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారాడు.

అతని వింత టాయిలెట్‌కు సంబంధించిన ఒక వీడియో చూసిన తర్వాత, టాయిలెట్‌లో ఇలాంటి వాటిని ఎవరు ఉంచుతారు? అని నెటిజన్లు అవాక్కవుతున్నారు.ఆ వ్యక్తి లివింగ్ రూమ్‌, బాత్ రూమ్( Bath room ) అనే తేడాను మర్చిపోయినట్లు తెలుస్తోంది.

ఇన్‌స్టాగ్రామ్‌( Instagram )లో షేర్ చేసిన ఈ వీడియోలో ఈ లెట్రిన్ సాధారణ టాయిలెట్‌లాగా కాకుండా పూర్తిగా భిన్నంగా ఉంది.ఇందులో లెట్రిన్ సీట్, బకెట్ కూడా బాగానే ఉన్నాయి, కానీ వాటితో పాటు అందమైన పెయింటింగ్స్‌, పెద్ద మ్యూజిక్ సిస్టమ్‌, డెకరేటివ్ లైట్లు, ఒక పెద్ద అద్దం, హై స్పీడ్ టేబుల్ ఫ్యాన్ ఉన్నాయి.ఇది చూస్తుంటే ఒక లివింగ్ హాల్( living hall ) లాగా కనిపించింది కానీ అది మలవిసర్జన చేసే ఒక టాయిలెట్.

Advertisement

దాన్నే చాలా అందంగా, చాలా స్పెషల్‌గా అతను ఏర్పాటు చేసుకోవడం చూసి చాలామంది ఇదేందయ్యా అంటున్నారు.అంతేకాదు ఇక్కడ స్నాక్స్ ఒక్కటే తక్కువయ్యాయి.అవి కూడా పెట్టుకుంటే ఒక సినిమా హాల్ అయిపోతుందని ఫన్నీగా కామెంట్ పెడుతున్నారు.

దీనిని మీరు కూడా చూసేయండి.బహుశా ఇలాంటి సెటప్ తో ఒక టాయిలెట్ మీరు ఎక్కడ చూసి ఉండరు.

Advertisement

తాజా వార్తలు