ప్లాస్టిక్ సర్జరీ వల్ల మూడేళ్లు నరకం చూశా.. నా ముఖం నా ఇష్టం.. మీకెందుకు?

బాలీవుడ్ లో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు నెపోటిజం పై స్పందించిన విషయం తెలిసిందే.బాలీవుడ్ లో నెపోటిజం, గ్రూపిజం అన్నది కొత్తేమీ కాదు.

వీటి వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సెలబ్రిటీలు నిర్మొహమాటంగా, బాహ్యంగానే నోరువిప్పారు.ఈ నేపథ్యంలోనే తాజాగా బాలీవుడ్ నటి కొయినా మిత్రా కూడా నెపోటిజం పై స్పందించింది.

ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ ఇండస్ట్రీలో నెపోటిజం, గ్రూపు రాజకీయాలు ఉన్నాయి అన్న విషయాన్ని నేను అంగీకరిస్తాను.ఎందుకంటే వాటి వల్ల ఇప్పటికే ఎంతోమంది ఇబ్బందులు పడ్డారు.

వారిలో నేను కూడా ఒకరిని అని ఆమె తెలిపింది.నేను సినీ బ్యాక్ గ్రౌండ్ లేని వ్యక్తి అయినా కూడా ఇండస్ట్రీలో నేను మంచి బ్రేక్ ని అందుకున్నాను.

Advertisement

కానీ నాకు అవసరం అయినప్పుడు ఇండస్ట్రీలో ఏ ఒక్కరు కూడా నాకు అండగా నిలబడి లేదు అని ఆమె తెలిపింది.నా కోసం ఏ ఒక్కరూ కూడా పెదవి విప్పి మాట్లాడలేదు అన్న ఫిర్యాదు నాకు ఎప్పుడూ ఉంటుంది అని ఆమె చెప్పుకొచ్చింది.

ఇక నా ప్లాస్టిక్ సర్జరీ విషయానికి వస్తే అది పూర్తిగా నా నిర్ణయం.నా వ్యక్తిగత విషయాలకు సంబంధించింది.

నా పేస్.నా ఇష్టం.

నాకు ఇష్టం వచ్చి నట్లు చేసుకుంటాను.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

నేను సర్జరీ చేయించుకుంటే జనాలకు వచ్చే సమస్యలు ఏంటి? సర్జరీ గురించి ఓపెన్ గా చెప్పవద్దు అన్న విషయం నాకు తెలియదు కానీ దాని గురించి నన్ను అడిగారు కాబట్టి.అవును నేను చేయించుకున్నాను అని వివరాలు తెలిపాను అని ఆమె తెలిపింది.ఆ మాత్రం దానికి నన్ను ఎన్నో మాటలు అన్నారు.

Advertisement

అంతేకాకుండా నా మీద వ్యతిరేక వార్తలను కూడా సృష్టించారు.ఈ క్రమంలోనే సినీ ఇండస్ట్రీలో కొందరు నాతో దూరం పాటించారు.

దీనితో నా కెరీర్ దెబ్బతీసింది.అలా మూడేళ్లు నాకు నరకం అంటే ఏంటో చూపించారు.

ధైర్యంగా ఉండండి అంటూ హితబోధ చేస్తున్నవారు మీడియా ముందుకు వచ్చి మాత్రం నాకు సపోర్ట్ గా మాట్లాడరు అని చెప్పుకొచ్చింది కొయినా మిత్ర..

తాజా వార్తలు