భారత సంతతికి చెందినా ఇండో అమెరికన్స్ గా పేరొందిన వ్యక్తులు ఎంతో మంది అమెరికాలో ఉన్నత స్థానాలని అధిరోహించి ఘన కీర్తిని పొందారు.అయితే ఈ కోవలోనే భారత సంతతికి చెందిన నియోమిరావు అత్యంత శక్తివంతమైన న్యాయమూరిగా అమెరికా సెనేట్ ధృవీకరించింది.
లైంగిక దాడి కేసులకు సంబంధించి గతంలో ఆమె రాసిన తీర్పులు ప్రశంసలు పొందాయి.
దాంతో దేశంలో అత్యంత శక్తివంతమైన అప్పీలేట్ కోర్టులలో ఒకటైన డిసి సర్కూట్ కోర్టుకు జడ్జిగా నియోమిరావు పేరు పరిశీలనలో ఉందని తెలుస్తోంది.గత ఏడాది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియమించిన వివాదాస్పద బ్రెట్ కవానాగ్ స్థానంలో 45 ఏళ్ల మహిళా న్యాయమూర్తి రావును నియమించనున్నారు.
అంతేకాదు ఆమె నియామకాన్ని 53 – 46 ఓట్ల తేడాతోసెనేట్ కూడా ధృవీకరించింది.అయితే ఆమె ఈ కోర్టుకు ఎన్నికయిన రెండవ భారత సంతతి వ్యక్తి కావడం గమనార్హం.నియోమీ ప్రస్తుతం సమాచార, నియంత్రణ వ్యవహారాల కార్యాలయంలో అడ్మినిస్ట్రేటర్‌గా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు