నెల్లూరు: వైసిపి బహిష్కృత ఎమ్మెల్యేలకు నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సవాల్.వచ్చే ఎన్నికల్లో కోటంరెడ్డి, ఆనం, మేకపాటికి ఓటమి తప్పదు.
వచ్చే ఎన్నికల్లో ఈ ముగ్గురు గెలిచి అసెంబ్లీకి వస్తే.నా రాజకీయాన్ని మూసేస్తా.
నేను గెలిచి అసెంబ్లీకి వస్తే.మీరు రాజకీయాల నుంచి వెళ్లిపోతారా.2024 ఎన్నికల్లో ఎవరు అసెంబ్లీకి వస్తారో తేల్చుకుందాం.
ఈసారి అనిల్ ను శాసనసభకు రానీయమంటూ కొందరు మంగమ్మ శపథాలు చేస్తున్నారు.
ఇటీవల పసుపు కండువా కప్పుకున్న కొందరు జిల్లాలో పదికి పది స్థానాలు సాధిస్తామని చెబుతున్నారు.పది స్థానాలు కాదు.వెళ్లిన ముగ్గురు ముందు గెలవండి.వచ్చే ఎన్నికల్లో జగన్ బొమ్మతోనే నేను ఎన్నికల్లో పోటీ చేస్తా.
గెలుస్తా.నన్ని ఆపండి.
చూద్దాం.ముగ్గురు ఎమ్మెల్యేలు వెళ్లడం వల్ల జిల్లాలో వైసీపీకి ఊడిందేమీ లేదు.
కార్యకర్తలు, ప్రజలు జగన్ వెంటే ఉన్నారు.వచ్చే ఎన్నికల్లోను జగన్ కు ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు.