ఈ గవర్నమెంట్ స్కూలు ముందు కార్పొరేట్‌ స్కూల్స్‌ కూడా ఎందుకూ పనికిరావు!

నేడు దాదాపు ప్రభుత్వ స్కూల్స్ అనే దానిలో విద్యార్థులు జాయిన్ అవ్వడం మానేశారు.

ఉన్నతమైన విద్యకోసం వేలకువేలు వెచ్చించి మరీ కార్పొరేట్‌ విద్యా సంస్థలలో జాయిన్ అవుతున్నారు.

ఈ క్రమంలో చాలా మంది తల్లిదండ్రులు అప్పు చేసి మరీ ప్రైవేటు పాఠశాలల్లో చిన్నారులను చేర్పిస్తున్నారు.అందుకే పేరున్న ప్రైవేటు పాఠశాలల్లో ఇపుడు సీటు దొరకడం చాలా కష్టంగా వుంది.

రికమెండేషన్లు ఉన్నా రూ.లక్షల్లో ఫీజులు కట్టాల్సిన పరిస్థితి నెలకొంది నేడు.ఇలాంటి పరిస్థితులలో కూడా పేరెంట్స్‌ మాత్రం తమ పిల్లలను ప్రైవేటు విద్యా సంస్థల్లోనే చేర్పించడానికి ఇష్టపడుతున్నారు కానీ ప్రభుత్వ పాఠశాలలపై ఆసక్తి చూపించడం లేదు.

అయితే ఇలాంటి పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఎంత ట్రై చేసినా సీటు దొరకడం లేదు.ఎన్ని రికమండేషన్స్ చేసినా అక్కడ సీటు అనేది అందని ద్రాక్షలాగా మారుతుంది.

Advertisement

ఇంతకీ ఆ పాఠశాల ఎక్కడ ఉంది? దానికి ఉన్న ప్రత్యేకత ఏంటో ఇపుడు తెలుసుకుందాం.నెల్లూరు జిల్లాలోని KNR నగరపాలక సంస్థ పాఠశాల పెద్ద పెద్ద కార్పొరేట్‌ విద్యాసంస్థలకు సైతం సవాల్‌ విసురుతోంది.

గత 20 ఏళ్లుగా అత్యుత్తమ ఫలితాలతో ఈ పాఠశాల దూసుకుపోవడం విశేషం.తాజాగా విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో కూడా ఈ పాఠశాల విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు.

ఈ క్రమంలో KNR పాఠశాలకు చెందిన తర్షశ్రీ అనే విద్యార్థిని 10వ తరగతి పరీక్షల్లో ఏకంగా 590 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది.అంతేకాకుండా 35 మంది విద్యార్థులు 550 కంటే ఎక్కువ మార్కులు సాధించడం విశేషం.ఇంతటి అద్భుత ఫలితాలు దక్కుతున్నాయి కాబట్టే ఈ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్‌ కావాలంటే కష్టంగా మారుతోంది.

ఎంతలా అంటే మా పాఠశాలలో సీట్లు ఖాళీలు లేవని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొనే పరిస్థితి వచ్చింది వారికి.ఇంకో విషయం ఏమంటే ఇక్కడ జాయిన్ అయినవారికి వారు పరీక్షలు కూడా నిర్వహించడం కొసమెరుపు.

వైరల్ వీడియో : రేవ్ పార్టీలో యాక్టర్ రోహిణి నిజంగానే దొరికిందా లేక ప్రాంకా..?
Advertisement

తాజా వార్తలు