రజనీకాంత్ కు నటుడు కావాలని బీజం పడటానికి అసలు కారణమిదా.. ఆ శబ్దాలు వినిపించడంతో?

సూపర్ స్టార్ రజనీకాంత్( Rajinikanth ) నటించిన జైలర్ మూవీ ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో ఒకటనే సంగతి తెలిసిందే.

ఈ సినిమా త్వరలో బుల్లితెరపై ప్రసారం కానుంది.

రజనీకాంత్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలపై భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడ్డాయి.రజనీకాంత్ లోకేశ్ కనగరాజ్( Lokesh Kanagaraj ) కాంబో మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో మొదలుకానుండగా ఈ సినిమా రికార్డులు తిరగరాసే మూవీ అవుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

అయితే రజనీకాంత్ కు నటుడు కావాలని బీజం పడటానికి అసలు కారణం ఏంటనే ప్రశ్నకు చాలామందికి సమాధానం తెలియదు.రజనీకాంత్ కెరీర్ తొలినాళ్లలో కండక్టర్ గా పని చేశారనే సంగతి తెలిసిందే.

రజనీకాంత్ వయస్సు ప్రస్తుతం 70 సంవత్సరాలు కాగా ఇతరులను గౌరవించే విషయంలో రజనీకాంత్ ముందువరసలో ఉంటారు.విశ్రాంత న్యాయవాది ఎస్కే కృష్ణన్ ( SK Krishnan )రజనీకాంత్ గొప్పదనం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

రజనీకాంత్ ను అందరూ ఆశ్చర్యంగా చూస్తారని అత్యంత గౌరవం ఇస్తారని ఆయన తెలిపారు.శ్రమ, కృషి, పట్టుదల వల్లే రజనీకాంత్ ఈ స్థాయిలో సక్సెస్ అయ్యారని ఎస్కే కృష్ణన్ కామెంట్లు చేశారు.రజనీకాంత్ ను స్పూర్తిగా తీసుకుని శ్రమిస్తే ఎవరైనా సక్సెస్ అవుతారని ఎస్కే కృష్ణన్ అన్నారు.

చెన్నైలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో ఎస్కే కృష్ణన్ ఈ కామెంట్లు చేయడం గమనార్హం.యునైటెడ్ ఆర్టిస్ట్ ఆఫ్ ఇండియా నిర్వాహకుడు నైల్లె సుందరాజన్( Nile Sundarajan ) మాట్లాడుతూ బస్ కండక్టర్ గా పని చేసే రజనీకాంత్ ఒకరోజు విధులు ముగించుకుని ఇంటికి వచ్చే సమయంలో సంగీత ధ్వనులు వినిపించాయని చెప్పుకొచ్చారు.

ఆ రిహార్సల్స్ నాటక రిహార్సల్స్ శబ్దాలు రావడంతో అప్పుడే రజనీకాంత్ నటనకు బీజం పడిందని ఆయన తెలిపారు.రజనీకాంత్ మరిన్ని విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.రజనీకాంత్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట
Advertisement

తాజా వార్తలు