సాధారణంగా మన కడుపున పుట్టిన పిల్లల పై ప్రతిక్షణం మన దృష్టిని సారిస్తూ వారి జాగ్రత్తల గురించి ఆలోచిస్తూ ఉంటాము.కొన్ని నిమిషాల పాటు పిల్లల్లో కనపడకపోయినా ఏం జరిగిందో అని కంగారు పడతాము.
అయితే పుట్టిన నెలకే ఓ హీరోయిన్ తనకు బిడ్డ ఉందన్న సంగతి కూడా మర్చిపోయి తనని ఇంట్లో వదిలి వెళ్ళిపోయింది.అసలు అలా ఆ హీరోయిన్ ఎందుకు చేసింది, బిడ్డను ఇంట్లో వదిలి వెళ్ళడానికి కారణం ఏమిటి.
ఆ హీరోయిన్ ఎవరనే విషయానికి వస్తే…
బాలీవుడ్ లేడీ నేహా ధూపియా తన మొదటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత జరిగిన ఓ ఇన్సిడెంట్ ఈ సందర్భంగా ఆమె బయట పెట్టారు.ఈ క్రమంలోనే నేహా దూపియా తహీరా కశ్యప్ రచించిన ‘సెవెన్ సిన్స్ ఆఫ్ బీయింగ్ మామ్’ పుస్తకంపై స్పందిస్తూ ఇంస్టాగ్రామ్ ద్వారా తన జీవితంలో జరిగిన ఈ సంఘటన గురించి బయట పెట్టారు.
తనకు మొదటి బిడ్డ పుట్టిన తర్వాత నలభై రోజులపాటు ఇంటికే పరిమితం అయ్యానని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఇలా 40 రోజుల పాటు ఇంట్లోనే ఉండటంతో తన భర్త అంగద్ బేడీతో కలిసి ముంబై సీ లింక్‌లో డ్రైవింగ్ వెళ్లాలనుకున్నా. అయితే 40 రోజుల తర్వాత బయటకు వెళ్లడంతో ఎంతో ఎగ్జైట్ అయ్యానని ఆ ఎక్సయిట్మెంట్ లో తన బిడ్డను ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళిపోయాను అని తెలిపారు.ఇలా బయటకు వెళ్లిన 45 నిమిషాల తర్వాత నర్స్ ఫోన్ చేసి పాప ఏడుస్తుందని చెప్పడంతో ఈ విషయం నీకేలా తెలుసని అడగడంతో అప్పుడు ఆమె అసలు విషయం చెప్పింది.
దీంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసుకుంటే తనతో పాటు తన బేబీను తీసుకురావడం మర్చిపోయానని అర్థమైందని ఈ సందర్భంగా నేహా దుపియా తన మొదటి సంతానం విషయంలో జరిగిన సంఘటనను బయటపెట్టారు.