ఆ టాపిక్ ను చిరంజీవి వదిలేస్తే బెటర్.. ఈ ట్రోల్స్ అవసరమా మాస్టారూ!

మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్ లో ఎంతోమంది దర్శకులతో పని చేశారు.హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా ఎంతోమంది దర్శకులను చిరంజీవి ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

 Negative Reactions About Megastar Chiranjeevi Comments Details Here Goes Viral ,-TeluguStop.com

అయితే ఈ మధ్య కాలంలో చిరంజీవి చేస్తున్న కొన్ని కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.ఆచార్య సినిమా విడుదలైన తర్వాత చిరంజీవి కొరటాలదే తప్పనే విధంగా కొన్ని కామెంట్లు చేయగా ఆ కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి.

తాజాగా దర్శకుల గురించి చిరంజీవి మాట్లాడుతూ దర్శకులు అవసరం మేరకు తీసుకోవాలని సాధారణ కెమెరాతో కూడా గొప్ప సినిమా తీయాలని నిర్మాతల డబ్బులను వేస్ట్ చేయవద్దని నేను ఎవరినో ఉద్దేశించి ఈ కామెంట్లు చేయడం లేదని చిరంజీవి తెలిపారు.నేను చెప్పే మాటలకు దర్శకులు హర్ట్ అయ్యే అవకాశం ఉందని చెబుతూనే చిరంజీవి ఈ కామెంట్లు చేయడం గమనార్హం.

అయితే ఈ మధ్య కాలంలో చిరంజీవి వ్యాఖ్యలు దర్శకులను టార్గెట్ చేసేలా ఉన్నాయి.

చిరంజీవి కావాలని మాట్లాడకపోయినా కొంతమంది దర్శకులు బాధ పడుతున్నారు.చిరంజీవి కొరటాల శివను టార్గెట్ చేశారని భావించి కొంతమంది అభిమానులు కొరటాల శివకు తాము అండగా ఉంటామని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.అయితే చిరంజీవి వివాదాల్లో చిక్కుకోకుండా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

చిరంజీవి మంచికే చెప్పినా దర్శకుల తీరు మారదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చిరంజీవి ఎందుకు ఈ విధంగా కామెంట్లు చేస్తునారో అర్థం కావడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.చిరంజీవి భోళా శంకర్ మినహా ఏ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పడం లేదు.చిరంజీవి కొత్త ప్రాజెక్ట్ లు పలు బ్యానర్లలో ఫిక్స్ కాగా ఆ సినిమాలకు దర్శకులు ఫిక్స్ కావాల్సి ఉంది.

చిరంజీవి వెంకీ కుడుముల కాంబోలో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉండగా ఆ మూవీ ఆగిపోయిందని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube