Revanth Sri Satya : రేవంత్ విన్నర్ కావడం కష్టమేనా.. అమ్మాయిలపై అసభ్యంగా మాట్లాడుతూ?

బిగ్ బాస్ సీజన్6 విన్నర్ ఎవరనే ప్రశ్నకు ఎక్కువమంది రేవంత్ పేరును సమాధానంగా చెబుతున్నారు.

ఎక్కువమంది ప్రేక్షకులకు రేవంత్ ఆటతీరు నచ్చిన నేపథ్యంలో రేవంత్ బిగ్ బాస్ విజేతగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సింగర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును, పాపులారిటీని సొంతం చేసుకున్న రేవంత్ బిగ్ బాస్ హౌస్ లో కొన్ని సందర్భాల్లో తప్పులు చేసినా అతని ఆటిట్యూడ్ ఎక్కువమందికి తెచ్చింది.బిగ్ బాస్ సీజన్6 మెజారిటీ ప్రేక్షకులకు నచ్చకపోయినా రేవంత్ కోసమే ఈ సీజన్ ను చూస్తున్నామని చాలామంది తమ మనస్సులోని అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండనుందని బిగ్ బాస్ ప్రేక్షకులకు భారీ షాక్ ఇవ్వనున్నాడని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.ఈ వారం ఎలిమినేషన్ విషయంలో ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది.

అయితే కొన్ని తప్పులను రిపీట్ చేస్తే మాత్రం రేవంత్ కు నష్టమని వినిపిస్తోంది.అమ్మాయిలపై పలు సందర్భాల్లో రేవంత్ చేసిన కామెంట్ల వల్ల అతని పాపులారిటీ క్రమంగా తగ్గుతోంది.

Advertisement
Negative Comments About Revanth In Bigg Boss Show Details Here Goes Viral , Rev

ఇనయా సుల్తానా, శ్రీ సత్యలను రేవంత్ శాడిస్ట్ అని కామెంట్ చేయడం వాళ్ల అభిమానులకు చిరాకు తప్పించింది.రేవంత్ ఇదే విధంగా చేస్తే మాత్రం రేవంత్ బిగ్ బాస్ విన్నర్ కాకపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Negative Comments About Revanth In Bigg Boss Show Details Here Goes Viral , Rev

13 వారాల బిగ్ బాస్ షో ముగిసిన నేపథ్యంలో రెండు వారాలలో బిగ్ బాస్ షో పూర్తి కానుంది. ఈ నెల 18వ తేదీనాటికి బిగ్ బాస్ షో పూర్తి కానుందని సమాచారం అందుతోంది.బిగ్ బాస్ షో విజేతకు గత సీజన్లతో పోల్చి చూస్తే తక్కువ మొత్తం పారితోషికం అందనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బిగ్ బాస్ షో సీజన్6 ను సక్సెస్ చేయడం నాగార్జున వల్ల కూడా కాలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?
Advertisement
" autoplay>

తాజా వార్తలు