నెక్లెస్ రోడ్ పేరును ‘‘ పీవీ నరసింహారావు మార్గ్‌’’ గా నామకరణం చేసిన కేసిఆర్ సర్కార్..!

తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు.

హైదరాబాద్ మహానగరంలో ప్రముఖ పర్యాటక స్థలంగా చెప్పుకునే నెక్లెస్ రోడ్డు పేరును కాస్త ‘‘ పీవీ నరసింహారావు మార్గ్‌’’ గా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు.

తాజాగా పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి ఈ నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది.ఇందుకు సంబంధించిన విషయాన్ని గత సంవత్సరం ఆగస్టు నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

అందుకు తగినట్లుగానే నేడు తాజాగా ప్రభుత్వ నిర్ణయానికి కేబినెట్ లో ఆమోదముద్ర వేసింది కేసీఆర్ ప్రభుత్వం.ఆదివారం నాడు ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో మరో 10 రోజుల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే.

ఈ సమావేశంలోనే నెక్లెస్ రోడ్ సంబంధించిన పేరు మార్పు నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఇక లాక్ డాన్ సమయాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ఉండగా.అనేక మంది నుచి వచ్చిన విన్నపాల నేపథ్యంలో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపును పొడిగించారు.ఇక ఆపై మధ్యాహ్నం రెండు గంటల వరకు మనుషులు ఇంటికి వెళ్లడానికి వెసులుబాటును కల్పించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

అంతేకాకుండా మరో రెండు రోజుల్లో రాబోయే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను వీలైనంత వరకు నిరాడంబరంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత కాస్త తగ్గినప్పటికీ లాక్ డౌన్ పూర్తిగా తీసేస్తే కేసులు మళ్ళీ తిరిగి పుంజుకునే అవకాశం ఉండడంతో లాక్ డౌన్ ప్రక్రియను కొనసాగించారు.

Advertisement

తాజా వార్తలు