ఎట్టకేలకు కోలీవుడ్ ప్రేమజంట నయనతార, విగ్నేష్ మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు.దీంతో అభిమానులు సెలబ్రిటీలు ఆ కొత్త జంట కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
మీ జంట ఎప్పుడు ఎప్పుడూ మూడుముళ్ల బంధంతో ఒకటవుతారా అని తెలుగు సినీ ప్రేక్షకులతో పాటు కోలీవుడ్ సినీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూశారు.ఇక తాజాగా వీరి పెళ్లి జూన్ 9వ తేదీ మహాబలిపురంలో పెరటాన్ గ్రాండ్ రిసార్ట్ హోటల్ లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.
ఇరువురి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులు, పలువురు సినీ సెలబ్రిటీల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది.
ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇప్పటివరకు బాగానే ఉన్నప్పటికీ నయనతార ఒక సెలబ్రిటీని మ్యారేజ్ కీ ఇన్వైట్ చేయడం పై అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.ఆ హీరో మరెవరో కాదు మలయాళ వివాదాస్పద హీరో దిలీప్ కుమార్.
ఇతను నటి భావన లైంగిక వేధింపుల వ్యవహారంలో దిలీప్ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించిన సంగతి తెలిసిందే.ఒకప్పుడు మంజు వారియర్ భర్త అయిన దిలీప్ మరో నటితో వివాహం సంబంధం పెట్టుకున్నాడనే విషయం భావన ఆమెకు వరకు తీసుకు వెళ్ళింది.

ఈ క్రమంలోనే సదరు నటితో కలిసి ఆమె తమ్ముడి సహాయంతో భావన మీద దిలీప్ అండ్ కో లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే.అటువంటి హీరోని నయనతారా పెళ్లికి ఇన్వైట్ చేయడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇక పెళ్లి అయిన తర్వాత ఈ జంట తమిళనాడు వ్యాప్తంగా ఉన్న లక్ష మంది అనాధ పిల్లలకు ఉచితంగా అన్నదానం గొప్ప మనసు చాటుకున్నారు.ఇక నయనతార చేసిన పనికి అభిమానులు ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు.
ఇక వీరి పెళ్ళికి టాలీవుడ్,బాలీవుడ్,కోలీవుడ్ నుంచి సెలబ్రిటీలు హాజరైన విషయం తెలిసిందే.