కనెక్ట్ రివ్యూ: ప్రేక్షకులకు కనెక్ట్ చేయలేకపోయినా డైరెక్టర్!

డైరెక్టర్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా కనెక్ట్.నయనతార కీలకపాత్రలో నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య రూపొందింది.

 Nayanthara Connect Movie Review And Rating Details, Connect Review, Nayanthara,-TeluguStop.com

ఇక ఇందులో అనుపమ్ ఖేర్, సత్యరాజ్, వినయ్ రాయ్, హనియా నఫీసా తదితరులు నటించారు.ఇక ఈ సినిమాకు నయనతార భర్త విగ్నేశ్ శివన్ నిర్మాతగా బాధ్యతలు చేపట్టాడు.

పృధ్వి చంద్రశేఖర్ మ్యూజిక్ అందించాడు.మణికంఠ ని కృష్ణమాచారి సినిమాటోగ్రఫీ అందించాడు.

ఇక ఈ సినిమా లాక్ డౌన్ హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో తమిళ భాషలో రూపొందింది.దీంతో తెలుగులో కూడా ఈ సినిమాను డబ్బింగ్ ద్వారా యువి క్రియేషన్స్ సంస్థ విడుదల చేసింది.

ఇక ఈరోజు ఈ సినిమా థియేటర్లో విడుదల కాగా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం.

Telugu Anupam Khar, Connect, Connect Review, Nayanthara, Satya Raj, Vinay Roy-Mo

కథ:

కథ విషయానికొస్తే.ఇందులో నయనతార సూజన్ అనే పాత్రలో నటించింది.హనియ నఫీసా అమ్ము పాత్రలో, వినయ్ రాయ్ జోసఫ్ బినోయ్ పాత్రలో, సత్య రాజ్  ఆర్ధర్ శామ్యూల్ అనే పాత్రలో నటించారు.

వీళ్లంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు.అయితే జోసఫ్ కోవిడ్ సమయంలో కోవిడ్ కారణంగా మరణిస్తాడు.ఇక తండ్రి మరణించడంతో అమ్ము తట్టుకోలేక ఓ పిచ్చి పని చేస్తుంది.దానివల్ల కుటుంబానికి పెద్ద సమస్య వస్తుంది.

ఇంతకీ అమ్ము చేసిన ఆ పిచ్చి పని ఏంటి.దానిని సూజన్ ఎలా ఎదుర్కొంటుంది.చివరికి ఏం జరుగుతుంది అనేది మిగిలిన కథలోనిది.

నటినటుల నటన:

ఇక నయనతార నటన గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు.ఇక ఈ సినిమాలో కూడా తన పాత్రలో లీనమైంది.అమ్ము పాత్రలో నటించిన హనియ తన పాత్రతో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.ఇక సత్యరాజ్ తన పాత్రలో లీనమయ్యాడు.వినయ్ రాయ్, అనుపమ్ ఇద్దరు పర్వాలేదు అన్నట్లుగా కనిపించారు.

Telugu Anupam Khar, Connect, Connect Review, Nayanthara, Satya Raj, Vinay Roy-Mo

టెక్నికల్:

టెక్నికల్ పరంగా.దర్శకుడు ఈ సినిమాకు మంచి కథను అందించినప్పటికీ కూడా ఎందుకో ఈ సినిమాతో అంతగా మెప్పించ లేనట్లు కనిపించింది.ఇక సౌండ్ డిజైన్ మాత్రం బాగా ఆకట్టుకుంది.మ్యూజిక్ కూడా పరవాలేదు.సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది.

విశ్లేషణ:

ఈ సినిమాకు డైరెక్టర్ కథను చూపించే విధంగా వెనుకబడినట్లు కనిపించాడు.ఎక్కడ కూడా ఎమోషనల్ టచ్ లేకుండా సాగదీశాడు అన్నట్లుగా ఉంది.పైగా భయపెట్టే సన్నివేశాలు కూడా అంతగా కనిపించలేదు.

Telugu Anupam Khar, Connect, Connect Review, Nayanthara, Satya Raj, Vinay Roy-Mo

ప్లస్ పాయింట్స్:

నయనతార నటన, సౌండ్ డిజైన్.

మైనస్ పాయింట్స్:

ఎమోషనల్ లేకపోయింది.కొన్ని సన్నివేశాలు బాగా సాగదీశారు.డైరెక్టర్ ఇంకాస్త జాగ్రత్త పడితే బాగుండేది.

బాటమ్ లైన్:

చివరిగా చెప్పాల్సిందేంటంటే.ఈ సినిమా హారర్ థ్రిల్లర్ అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా అటువంటి కాన్సెప్ట్ తో కనెక్ట్ చేయలేకపోయాడు డైరెక్టర్.

కానీ కొంతవరకు మాత్రం కొన్ని సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి.ఒక్కసారి చూస్తే సరిపోతుంది అన్నట్లుగా ఈ సినిమా ఉంది.

రేటింగ్: 2.5/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube