Nayanatara : పెళ్లైనా గ్లామర్ షోలో తగ్గేదేలే.. నయనతార మళ్లీ అలా కనిపించనున్నారా?

మామూలుగా సినిమాలలో టూరి డిమాండ్ మేరకు హీరో హీరోయిన్లు ఎలాంటి సన్నివేశాలైన ఎలాంటి పాత్రలు చేయడానికి అయినా రెడీ అవుతూ ఉంటారు.ఈ క్రమంలోనే హీరోయిన్లు రొమాంటిక్ సన్నివేశాలలో నటించడంతో పాటుగా బికినీ వేయడానికి కూడా సిద్ధం అవ్వాల్సి ఉంటుంది.

అయితే సౌత్ సినిమాలలో బికినీ సన్నివేశాలు చాలా తక్కువ.కానీ బాలీవుడ్ లో అలా కాదు.

దాదాపు అందరు హీరోయిన్స్ బికినీ వేసి ట్రీట్ ఇస్తుంటారు.వాళ్ళు బికినీ వేయడం కథకు అనుగుణంగానే కావచ్చు కానీ, అది గ్లామర్ ప్రియులకు, అభిమానులకు పండగే అని చెప్పాలి.

అలా బికినీ వేసిన వారిలో నయనతార కూడా ఒకరు.నయనతార కెరీర్ ఆరంభంలో ఎటువంటి గ్లామరస్ రోల్స్ చేసిందో మనందరికీ తెలిసిందే.గ్లామర్ షో చేస్తూనే ముద్దు సన్నివేశాలు, బెడ్ సీన్స్ లో కూడా నటించింది నయనతార( Nayanatara )అప్పట్లోనే గ్లామర్ హీరోయిన్ గా స్టార్డమ్ సొంతం చేసుకుంది.

ఇది ఇలా ఉంటే గత కొన్నేళ్లుగా గ్లామర్ రోల్స్ కి దూరంగా ఉంటూ నటనకు ఆస్కారం ఉన్న సినిమాలు, పాత్రలు చేస్తూ కెరియర్ పరంగా దూసుకుపోతోంది నయనతార.అంతేకాకుండా స్టార్ హీరోల సినిమాలు మాత్రమే ఓకే చేస్తోంది ఈ బ్యూటీ.

ఈ మధ్యకాలంలో అయితే ఎక్కువగా లేడి ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా మారుతోంది.ఇది ఇలా ఉంటే త్వరలో షారుఖ్ ఖాన్ నటిస్తున్న జవాన్ సినిమాతో బాలీవుడ్ లోకీ అడుగుపెట్ట బోతోంది.

బాలీవుడ్ లో మొదటి సినిమానే షారుఖ్ ఖాన్ సరసన అవకాశం లభించేసరికి నయన్ తో పాటుగా అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.దర్శకుడు అట్లీ ( Atlee )తెరకెక్కిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతోంది.ఈ సినిమాను జూన్ 2న కొంచెం వ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయనున్నారు మూవీ మేకర్స్.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే జవాన్ సినిమాలో నయనతార బికినీ సీన్ చేయబోతోంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.షారుఖ్ సినిమాలలో ఇంటిమేట్ సీన్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

రీసెంట్ గా పఠాన్ లోను దీపికా పదుకొనే ( Deepika Padukone )బికినీ ట్రీట్ అదరగొట్టింది.కాబట్టి ఇప్పుడు జవాన్ లో కూడా హీరోయిన్ క్యారెక్టర్ లో ఆ రేంజ్ గ్లామర్ షో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు అభిమానులు.

మరి తారకు ప్రస్తుతం పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉండడంతో ఇప్పుడు బికినీ షో చేయడానికి ఓకే చెప్తుందో లేదో చూడాలి మరి.

తాజా వార్తలు