నయనతార విఘ్నేష్ శివన్ సరోగసి ద్వారా పిల్లల్ని కనడం ప్రస్తుతం సోషల్ మీడియా, వెబ్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.నయన్ విఘ్నేష్ లకు సరోగసి నిబంధనలు తెలియవా? అనే ప్రశ్నకు వాళ్లకు నిబంధనల గురించి అవగాహన ఉందని అయితే ఈ కేసు నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో వాళ్లు మాస్టర్ ప్లాన్ వేశారని తెలుస్తోంది.నయనతార పిల్లలకు జన్మనిచ్చిన మహిళ ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నారని సమాచారం.
దుబాయ్ లో సరోగసికి ఎలాంటి నిబంధనలు లేవు.
అందువల్ల నయనతార విఘ్నేష్ శివన్ ఈ పిల్లల వల్ల తమకు ఎటువంటి ఇబ్బందులు రావని భావిస్తున్నారని సమాచారం అందుతోంది చట్టపరంగా ఉన్న సమస్యల గురించి తెలిసి నయన్ విఘ్నేష్ ఈ విధంగా చేయగా రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.నయనతార విఘ్నేష్ శివన్ సరోగసి ద్వారా పిల్లల్ని కనడానికి కారణమేంటనే ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది.
పిల్లల్ని ముందుగానే ప్లాన్ చేసుకుని నయన్ విఘ్నేష్ పెళ్లి చేసుకున్నారని వైరల్ అయిన వార్తలు కూడా హాట్ టాపిక్ అయ్యాయి.
నయన్ విఘ్నేష్ సెలబ్రిటీలు అని సెలబ్రిటీలు నిబంధనలను అతిక్రమించడం కరెక్టేనా అంటూ మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సైతం హాట్ టాపిక్ అవుతున్నాయి.నయన్ విఘ్నేష్ స్పందించకపోవడం వల్లే ఈ వివాదం మరింత పెద్దదవుతోంది.
నయనతార విఘ్నేష్ శివన్ మన దేశ నిబంధనలను కూడా పాటించి ఉంటే బాగుండేదని మరి కొందరు చెబుతున్నారు.నయనతార జీవితమంతా వివాదాల్లోనే చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారని మరి కొందరు చెబుతున్నారు.నయనతార ఒక్కో ప్రాజెక్ట్ కు 8 నుంచి 10 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
నయన్ విఘ్నేష్ నెగిటివ్ కామెంట్ల విషయంలో ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.