తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కమలహాసన్ కూతురిగా సిని ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా రాణిస్తున్న విషయం తెలిసిందే.తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా అవకాశాలు అందుకుంటు దూసుకుపోతోంది.
ఇక శృతిహాసన్ కు యూత్ లో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈమె తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు తన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటుగా తన బాయ్ ఫ్రెండ్ హజారికాకు సంబంధించిన ఫోటోలను వీడియోలను కూడా పంచుకుంటూ ఉంటుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా శృతిహాసన్ కి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.కాగా శృతిహాసన్ కొన్నేళ్ల క్రితం తన ముక్కుకి సర్జరీ చేయించుకున్నాను అని సోషల్ మీడియా ద్వారా తెలిపిన విషయం తెలిసిందే.
ముక్కుకు గాయం కావడంతో సర్జరీ చేయించుకున్నట్లు శృతిహాసన్ తెలిపింది.అయితే ప్రస్తుతం తన ముక్కు మరింత సన్నగా కనిపిస్తుంది అని ఆమె పేర్కొంది.
అంతేకాకుండా తాను చేసిన పనిని సమర్థించుకోవాల్సిన అవసరం లేదు అని ఆమె తెలిపింది.మొదటి సినిమాలో నా ముక్కు కనిపించిన విధానం తర్వాత సినిమాల్లో వేరే విధంగా ఉంటుంది.ముక్కు సన్నగా ఉండాలని నేను సర్జరీ చేయించుకున్నానని అందరూ అనుకుంటున్నారు.కానీ అది నిజం కాదు ఎందుకంటే నా ముక్కుకు గాయం అయింది అందువల్లే నేను సర్జరీ చేయించుకున్నాను అని చెప్పుకొచ్చింది శృతిహాసన్.
ఈ విషయాన్ని కొందరు తప్పు పడుతూ ఉండడంతో ఆ విషయం పట్ల ఆమె స్పష్టత ఇచ్చి వారిపై ఫుల్ సీరియస్ అయ్యింది.ఇకపోతే ప్రస్తుతం శృతిహాసన్ సలార్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇందులో హీరోగా నటిస్తున్నారు.ఈ సినిమాలతో పాటుగా బాలకృష్ణ,మెగాస్టార్ చిరంజీవి ల సినిమాలలో కూడా ఈమె నటిస్తున్న విషయం తెలిసిందే.