నయనతార ప్రస్తుతం కోలీవుడ్‌లో లేడీ సూపర్ స్టార్‌గా దూసుకు పోతుంది.ఈ అమ్మడు గత రెండు మూడు సంవత్సరాలుగా చేసిన సినిమాలు తీసుకున్న పారితోషికం స్టార్ హీరోల లెక్కలను కూడా దాటేసింది.
లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో పాటు స్టార్ హీరోలకు జోడీగా కూడా ఈ అమ్మడు నటించింది.అయితే ఈమద్య కాస్త డల్ అయ్యింది.
దాంతో ఈమె మళ్లీ పుంజుకునేందుకు నిర్మాతలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.

కెరీర్ ఆరంభంలో గ్లామర్ పాత్రలు చేసిన నయనతార ఆ తర్వాత గ్లామర్ పాత్రలు వస్తే నో చెప్పింది.కాస్త హాట్ డ్రస్ వేసుకోమన్న కూడా నో చెప్పింది.గత అయిదు సంవత్సరాలుగా ఈమె హాట్ ఫొటోలు వీడియోలు లేనే లేవు.
ఇప్పుడు ఆఫర్లు తగ్గడంతో ఈమె మళ్లీ మునుపటిలా హాట్ పాత్రలు చేసేందుకు హాట్ సీన్స్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.కథ డిమాండ్ చేస్తే బికినీ కూడా వేసేందుకు సిద్దంగా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

ఈ అమ్మడు విఘ్నేష్ శివన్‌తో గత కొంత కాలంగా ప్రేమలో ఉంది.ఇద్దరు ప్రస్తుతం సహజీవనం కూడా సాగిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఇలాంటి సమయంలో మళ్లీ నయనతార హాట్ పాత్రలకు ఓకే చెప్పడం చర్చనీయాంశం అవుతుంది.ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని సంతోషంగా జీవితాన్ని గడిపాలని, మళ్లీ హాట్ పాత్రలు అంటూ ఎందుకు జీవితాన్ని వృదా చేసుకుంటారు అంటూ ఆమెకు కొందరు సలహా ఇస్తున్నారు.
కాని ఆమె మాత్రం ఇంకా రెండు మూడు సంవత్సరాలు సినిమాలు చేయాలని ఆశ పడుతుంది.అందుకే బికినీకి సిద్దం అవుతుంది.