ఇది నేను బలంగా గీసుకున్న గీత.. సినిమా ఇండస్ట్రీపై నయన్ షాకింగ్ కామెంట్స్!

సినిమా ఇండస్ట్రీలో ఇతర హీరోయిన్లకు నయనతారకు చాలా తేడాలు ఉన్నాయి.ఎంతోమంది హీరోయిన్లు తన సినిమాల ప్రమోషన్లకు హాజరై ఆ సినిమాలు సక్సెస్ సాధించాలని సినిమా రిలీజయ్యే చివరి క్షణం వరకు కష్టపడతారు.

 Nayanatara Shocking Comments About Movie Industry Details, Nayanthara, Nayanthar-TeluguStop.com

కొంతమంది హీరోయిన్లు సినిమాలు విడుదలైన తర్వాత కూడా ప్రమోషన్లలో పాల్గొని సినిమాలు సక్సెస్ కావడం విషయంలో తమ వంతు కృషి చేస్తారు.అయితే నయనతార మాత్రం సినిమా ప్రమోషన్స్ పై ఏ మాత్రం ఆసక్తి చూపరు.

ఎంతమంది విమర్శలు చేసినా ఈ విషయంలో నయనతార అస్సలు మారరని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేశారు.అయితే మూవీ ప్రమోషన్స్ కు హాజరు కాకపోవడానికి గల అసలు కారణాలను తాజాగా నయనతార వెల్లడించారు.

ఒక ఇంటర్వ్యూలో నయనతార మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.సినిమా రంగంలో హీరోయిన్లకు ఏ మాత్రం వాల్యూ లేదని ఆమె అన్నారు.

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు కూడా విలువ ఇస్తారని నేను భావించానని నయనతార పేర్కొన్నారు.అయితే కొంతకాలం చూసిన తర్వాత అలా జరగడం సాధ్యం కాదని నాకు అర్థమైందని ఆమె చెప్పుకొచ్చారు.అప్పటినుంచి నేను సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండటమే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యానని ఆమె చెప్పుకొచ్చారు.నేను తీసుకున్న ఈ నిర్ణయం బలంగా గీసుకున్న గీత అని నయనతార చెప్పుకొచ్చారు.

నయనతార చేసిన కామెంట్లను ఎవరూ సమర్థించడం లేదు.నయనతార ఆ నిర్ణయాన్ని ఫిక్స్ అయితే కనెక్ట్ సినిమా ప్రమోషన్స్ లో కూడా అస్సలు పాల్గొనకుండా ఉండాల్సి ఉంది.నయనతార చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండటం లేదని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.నయనతార మాటలు కరెక్ట్ గా లేవని కొంతమంది నెటిజన్లు భావిస్తున్నారు,

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube