లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవలే దర్శకుడు విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.వీరిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె సినిమాల ఎంపిక విధానం మారింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అదే సమయంలో నయన తార ఇక నుండి మీడియా ముందుకు సినిమాల ప్రమోషన్ కోసం వస్తానంటూ అనధికారికంగా చెప్పేసింది.ఆ విషయంలో అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు.
మరో వైపు ఆమె సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన భర్త విగ్నేష్ తో కలిసి తీసుకున్న రొమాంటిక్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు గుండె కోత మిగుల్చుతుంది.
ఇంత గొప్ప అందగత్తెకు అప్పుడే పెళ్లి అవ్వడం ఏంటి.
అది కూడా దర్శకుడు విగ్నేష్ శివన్ కి ఈమె ఓకే చెప్పడమేంటి అంటూ చాలా మంది చాలా రకాలుగా ఫన్నీ యాంగిల్ లో కామెంట్ చేస్తున్నారు.నయనతార ఇలా రొమాంటిక్ ఫోటోలు షేర్ చేయడం తో చాలా మంది గుండెలు బరువెక్కిపోయి కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేస్తున్నారట.
నయనతార కు పెళ్లి ఇంత త్వరగా అవుతుంది అనుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.విగ్నేష్ ని చూస్తుంటే అసూయగా ఉందని అతడికి దక్కిన అందం ఒక అద్భుతం అన్నట్లుగా ఆయన్ని గురించి నయనతార అభిమానులు చర్చించుకుంటున్నారు.
విగ్నేష్ తో నయనతార రొమాంటిక్ పిక్స్ చూసిన సందర్భం లో అభిమానులకు కన్నీళ్లు వస్తున్నాయి.

మరో వైపు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానంటూ ఇటీవల ఆమె చెప్పడంతో మరో కంట పన్నీరు అన్నట్లుగా అభిమానులకు ఉంది.హీరోయిన్ గా ఆమె ఇక ముందు నటించక పోవచ్చు అంటూ ఒక మీడియా సంస్థ కథనంలో పేర్కొంది.ఆమె కేవలం నిర్మాతగా కొనసాగే అవకాశం ఉందని ఆ ఆలోచనతోనే నిర్మాణ సంస్థని మొదలు పెట్టి వరుసగా చిన్న సినిమాలను పెద్ద సినిమాలను నిర్మిస్తున్నారని సదరు కథనంలో పేర్కొన్నారు.
కానీ తాను సినిమాల్లో నటిస్తానని హీరోయిన్ గా ఇంకా చేయాలని ఉందంటు నయనతార చెప్పడంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు
.






