లేడీ సూపర్ స్టార్ నయన తార ఇటీవలే పెళ్లి చేసుకుని తల్లి కూడా అయింది.అయినా కూడా నయన తార యొక్క క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.
ఆమె తో సినిమాల్లో నటించేందుకు స్టార్ హీరో ల నుండి సూపర్ స్టార్స్ వరకు చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా ఒక తమిళ స్టార్ హీరో సినిమా లో ఈమె హీరోయిన్ గా ఎంపిక అయింది.
అందుకు గాను ఏకంగా ఐదు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లుగా సమాచారం అందుతుంది.టాలీవుడ్ లో కూడా నయన తార కు ఉన్న స్టార్డం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఆమె లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తే ఇంతకు ముందు నాలుగు నుండి ఐదు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునేది.

ఇప్పుడు పెళ్లయి, పిల్లలయిన తర్వాత కూడా ఏకంగా ఐదు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అంటే ఈ అమ్మడి యొక్క స్టార్డం మరియు క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.కాస్త మంచి సినిమా పడితే 100 కోట్ల కలెక్షన్స్ నమోదు చేసే సత్తా ఉన్న లేడీ సూపర్ స్టార్ కనుక ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ ని తీసుకుంటుంది అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.తెలుగు లో నయన తార సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందంటూ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తమిళం లో వరుసగా సినిమాలు చేస్తున్న నయన తార తెలుగు విషయం లో కాస్త ఆచి తూచి వ్యవహరిస్తోంది ఎందుకు అనేది మాత్రం ఆమెకే తెలియాలి.

ఇక ఆమె భర్త విఘ్నేష్ శివన్ కూడా వరుసగా సినిమాలను చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.ఇప్పటి వరకు సూపర్ స్టార్ ఇమేజ్ తో దూసుకు పోతున్న నయనతార మరో రెండు మూడు సక్సెస్ లను దక్కించుకుంటే రాబోయే అయిదు నుండి పదేళ్ల వరకు బిజీ బిజీగా సినిమాలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
