10 సంవత్సరాల క్రితమే షారుక్ తో ఛాన్స్ వదులుకున్న నయనతార?

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ జవాన్ సినిమా( Jawan Movie )ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

సెప్టెంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా కోసం ఎంతో మంది అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ( Atlee ) దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమాలో షారుక్ ఖాన్ కి జోడిగా నయనతార( Nayanatara ) నటిస్తున్నారు.ఈ సినిమాతో ఈమె మొదటిసారి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

ఇక ఏడవ తేది ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో నయనతార షారుఖ్ ఖాన్( Shah Rukh Khan ) గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.నయనతార షారుక్ మొదటిసారి ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అయితే పది సంవత్సరాల క్రితమే షారుఖ్ ఖాన్ సినిమాలో నయనతారకు అవకాశం వచ్చినప్పటికీ ఆమె ఈ అవకాశాన్ని వదులుకున్నారట.షారుక్ ఖాన్ నటించిన చెన్నై ఎక్స్ప్రెస్( Chennai Express )సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.

Advertisement

దీపిక పదుకొనే( Deepika Padukone ) షారుఖ్ ఖాన్ నటించిన ఈ సినిమా సౌత్ ఇండస్ట్రీలో కూడా చాలా మంచి ఆదరణ సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమాలో నయనతారకు హీరోయిన్గా ఛాన్స్ కాకపోయినా ఈ సినిమాలో వన్ టూ త్రీ అనే స్పెషల్ సాంగ్ కోసం నయనతారను సంప్రదించారట.ఇలా స్పెషల్ సాంగ్ లో చేయడానికి నయనతార రిజెక్ట్ చేయడంతో ఆ అవకాశం ప్రియమణికి( Priyamani ) వచ్చింది.ఈ సాంగ్ చేసే అవకాశం ప్రియమణి అందుకోవడంతో ఈమెకు మరింత పాపులారిటీ వచ్చింది అయితే నయనతార ఈ అవకాశాన్ని వదులుకోవడానికి కారణం అప్పట్లో ఈమె స్టార్ హీరోయిన్గా వరుస సినిమాలలో నటిస్తున్నారు.

నయనతార స్పెషల్ సాంగ్ చేయడం వల్ల తన కెరియర్ పై తీవ్రమైన ప్రభావం చూపుతుందన్న కారణంతోనే ఈ సాంగ్ చేయడానికి రిజెక్ట్ చేశారని తెలుస్తుంది.అప్పుడు ఆ అవకాశం మిస్సయిన ఇప్పుడు మాత్రం షారుక్ పక్కన హీరోయిన్గా నటించే ఛాన్స్ అందుకున్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు