Nayanthara : నయన్ అదృష్టానికి అదే కారణమా.. చేతికి ఆరో వేలిని గమనించారా?

నయనతార( Nayanthara ) సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తన నటనతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించిన ఈమె ఇప్పటికీ వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు.

ఇలా హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్గా కూడా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.ఇకపోతే ఇటీవల కాలంలో ఈమె తన ప్రియుడు డైరెక్టర్ విగ్నేష్ ని( Director Vignesh ) ప్రేమ వివాహం చేసుకున్నారు.

ఇక ఈ దంపతులకు ఇద్దరు కవల పిల్లలు కూడా ఉన్న విషయం మనకు తెలిసిందే.ఇక నయనతార, విగ్నేష్ ఇద్దరు కూడా తవ పిల్లలతో కలిసి సరదాగా గడిపిన క్షణాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

ఈ విధంగా నయనతార తన వృత్తిపరమైన జీవితంలోను వ్యక్తిగత జీవితంలోను ఎంతో బిజీగా సంతోషంగా గడుపుతున్నారు.

Advertisement

ఇకపోతే తాజాగా నయనతారకి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.నయనతార ఎడమ చేతికి 6 వేళ్ళు( Six Fingers ) ఉన్నాయి అంటూ ఒక ఫోటో వైరల్ గా మారింది.నయనతార ప్రస్తుతం బిజినెస్ రంగంలోకి కూడా అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే . 9 స్కిన్( 9Skin ) అనే బ్యూటీ ప్రొడక్ట్స్ బిజినెస్ ప్రారంభించారు తాజాగా ఈమె తన ప్రొడక్ట్స్ అన్నింటితోను మేకప్ అవుతూ కనిపించారు ఈ తరుణంలోనే తన ఎడమ చేతికి 6 వేళ్ళు ఉండటంతో అభిమానులు అందరూ కూడా షాక్ అవుతున్నారు.

నయనతారకు ఎడమ చేతి చిటికెన వేలు పక్కనే మరొక చిన్న వేలు ఉంది చాలా చిన్నగా ఉండడంతో పెద్దగా ఎవరూ కూడా ఈ వేలిని గుర్తించలేదు కానీ ప్రస్తుతం మాత్రం ఈ వీడియో వైరల్ గా మారడంతో ప్రతి ఒక్కరూ నయనతారకు 6 వేళ్ళు ఉన్నాయని వేలు పక్కన మరొక చిన్న వీలు కూడా ఉంది అంటూ కామెంట్ కు చేస్తున్నారు.ఇక ఈ విషయం గురించి మరికొందరు స్పందిస్తూ నయనతారకు మరొక వేలు ఉండటం వల్ల తనకు ఇండస్ట్రీలో మంచి అదృష్టం( Luck ) కలిసి వచ్చిందని కూడా భావిస్తున్నారు.

ఇలా తనకు మరొక వేలు కూడా పుట్టింది అనే విషయాన్ని నయనతార ఎప్పుడూ కూడా ఎవరితోనూ పంచుకోలేదు.తాజాగా ఈ వీడియో వైరల్ గా మారడంతో ఈ విషయాన్ని గుర్తించి తనకు ,6 వేళ్ళు ఉన్నాయి అంటూ కామెంట్ చేస్తున్నారు.నిజంగానే నయనతారకు ఆవేలు అదృష్టంమనే చెప్పాలి.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!
Advertisement

తాజా వార్తలు