నయనతార.ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎంతో తెలివైన హీరోయిన్.ఈమె సినిమా చేసిందంటే.అది ప్లాప్ సినిమా అయినా సరే ఈమె నటన కోసం ఆ సినిమాను చూసేయచ్చు.అలా ఉంటాయి ఆ సినిమాలు.
ఎప్పుడో 17 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చిన నయనతార తన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.మొదట్లో కాస్త బొద్దుగా ఉన్న ఈ నటి తర్వాత సన్నగా అవుతూ అవుతూ ఎంతో అందంగా తయారయ్యింది.
ఇక అలానే ఇటీవల ఆమె నటించిన అమ్మోరు తల్లి సినిమా ఓటిటిలో విడుదలయ్యి సూపర్ హిట్ అయ్యింది.
ఇంకా ఈ సినిమా గురించి.
ఆమె సినీ కెరీర్ గురించి పక్కన పెడితే.పర్సనల్లి తను చాలా సాఫ్ట్.
నిజం మాట్లాడితే అమాయకురాలు.అందుకే ప్రేమించే విషయంలో మోసపోయింది.
ఇండస్ట్రీలో ఉన్న అతని పలుకుబడి వల్ల ఆమెకు సినిమా అవకాశాలు కూడా తక్కువగా వచ్చేవి.అలాంటి సమయంలోనే బలిహీనంగా ఉన్న ఆమె ఎలా అయినా స్టార్ అవ్వాలని గట్టిగా ట్రై చేసింది.
ఇంకేముంది మంచి స్టార్ హీరోయిన్ అయ్యింది.ఆ సమయంలో సూపర్ స్టార్ తో ప్రేమాయణం .అది కూడా బ్రేక్ అవ్వడం అయినా ఆమె కెరీర్ లో రాకెట్ లా దూసుకుపోయింది.

ఇంకా అప్పుడే దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడింది.ప్రస్తుతం డేటింగ్ లో ఉన్న వారు ఎప్పటికప్పుడు ఫోటోల వారు షేర్ చెయ్యకపోయినా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయ్.ఇక అలానే ఆమె పర్సనల్ విషయాల గురించి, రొమాన్స్ విషయాల గురించి చెప్పాలని అడిగిన సమయంలో ఆమె మాట్లాడుతూ.”నా మనసులోని భావాలను ప్రపంచానికి చెప్పడం ఇష్టం లేదు.నేను పూర్తిగా ప్రైవేట్ మనిషిని.
అందుకే ఎక్కడా నా వ్యక్తిగత జీవితం గురించి నేను మాట్లాడను.కేవలం నేను నటించిన సినిమాల గురించే మాట్లాడతాను.
గతంలో, నేను మీడియాతో మాట్లాడిన విషయాలను.చాలాసార్లు తప్పుగా ప్రచారంగా చేశారు” అంటూ ఓ సందర్భంలో ఆమె చెప్పుకొచ్చింది.