లేడీ సూపర్ స్టార్ నయనతార( Nayanatara ) పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.నయనతార ఇప్పటివరకు 74 సినిమాలలో నటించారు తాజాగా ఈమె బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్( Shahrukh Khan ) హీరోగా నటించిన జవాన్ ( Jawan )సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఈ సినిమా ద్వారా ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా పరిచయమయ్యారు.ఇక తన తదుపరి సినిమాని ఈమె నీలేష్ కృష్ణ ( Neelesh Krishna ) దర్శకత్వంలో నటిస్తున్నారు.
దానికి అన్నపూర్ణి అనే టైటిల్ కూడ పెట్టారు.ఇక ఈ సినిమాలో హీరోగా జై నటిస్తున్నారు.
నయనతార 75వ సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా నుంచి టీజర్( Annapoorni Teaser ) విడుదల చేయగా ఈ టీజర్ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.అయితే ఇందులో నయనతార ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన అమ్మాయిగా కనిపించబోతున్నారు.ఇక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన అమ్మాయి అంటే వారి ఆచార సాంప్రదాయాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే.
మడి ఆచారంతో ఎంతో నిష్టగా వంటలను తయారుచేసుకొని భోజనం చేస్తూ ఉంటారు .అలాగే మాంసాహారానికి చాలా దూరంగా ఉంటారు.

ఇలాంటి ఒక బ్రాహ్మణ కుటుంబం( Brahmin Family )లో జన్మించినటువంటి నయనతారకు మంచి చెఫ్ అవ్వాలన్నది కోరిక.వివిధ రకాల నాన్ వెజ్ వంటలను చేసి ఒక రెస్టారెంట్ ప్రారంభించాలన్నదే ఆమె కల.ఇక ఈ విషయం ఇంట్లో వారికి తెలియకుండా ఈమె తనకలను నిజం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు.ఇలా ఈ నేపథ్యంలో సినిమా మొత్తం కొనసాగుతుంది.
నాన్ వెజ్( Non Veg ) చేతితో కూడా తాకని కుటుంబంలో జన్మించినటువంటి నయనతార చెఫ్ గా( Nayanatara Chef Role ) ఎలా ఎదిగారు అనే వినోదాత్మక చిత్రం ద్వారా డైరెక్టర్ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని తెలుస్తుంది.ఇలా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ వీడియో వైరల్ గా మారడంతో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి అయుండుకొని నయనతార ఇలాంటి నాన్ వెజ్ వంటలు చేయడం సబబేనా అంటూ కొందరు ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు
.