నయనతార దంపతులు చట్టపరంగా చాలా పెద్ద సమస్యను ఎదుర్కోబోతున్నారు అంటూ ఇటీవల మీడియా లో ప్రముఖం గా కథనాలు వచ్చిన విషయం తెలిసిందే.వారిద్దరూ సరోగసి విధానం ద్వారా తల్లిదండ్రులు అయ్యారు.
ఇండియాలో సరోగసి విధానం చట్టపరంగా అమలు లో లేదు.మరి మీరు ఎలా తల్లిదండ్రులు అయ్యారు అంటూ కస్తూరి ట్వీట్ తర్వాత చాలా మంది డైరెక్టుగా నయనతార మరియు విగ్నేష్ శివన్ లను ప్రశ్నించడం మొదలు పెట్టారు.
ఈ విషయమై వారు పోలీస్ కేసు ఎదుర్కోవాల్సి రావచ్చు అంటూ చాలా మంది చాలా రకాలుగా అభిప్రాయం వ్యక్తం చేశారు.ఇప్పటికే కొందరు నయనతార దంపతులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే అంటూ కోర్టు ను ఆశ్రయించడం కూడా జరిగిందట.
ఈ విషయమై కోర్టు లో చర్యలు తప్పవని న్యాయపరమైన చిక్కులు వాళ్ల కు తప్పక పోవచ్చు అంటూ న్యాయ నిపుణులు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు.
అసలు విషయం ఏంటంటే నయనతార దంపతులు కనీసం కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం కూడా రాదు అంటున్నారు.ఎందుకంటే వారు తల్లిదండ్రులు అయింది ఇండియా లో కాదు.దుబాయి లో అంటూ తాజాగా తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.
నయనతార దంపతులకు పిల్లలను కని ఇచ్చింది ఒక దుబాయ్ మహిళ.దుబాయ్ లో ఉండే వారు కనుక ఎలాంటి చట్టపరమైన చిక్కులు ఉండవు అని సమాచారం అందుతుంది.
ఇలాంటి సమస్యలు వస్తాయని ముందుగా ఊహించిన నయనతార దంపతులు దుబాయ్ కి చెందిన మహిళ అద్దె గర్భం ద్వారా తమ పిల్లలకు జన్మనిచ్చారు.ఇన్నాళ్లు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్లు నయనతార మరియు ఆమె భర్తను విమర్శిస్తున్నారు.
తాజా కథనం తో వారందరి నోర్లు మూసుకోవడం ఖాయం.ఇన్నాళ్లు నయనతార ను ఇరికిద్దమని భావించిన కొందరికి వారు ఇచ్చిన కౌంటర్ అదిరి పోయింది అంటూ తమిళ మీడియా లో కొత్త గా కథనాలు వస్తున్నాయి.