బాలయ్యకు అసిస్టెంట్‌గా ఆత్రేయ

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తన తాజా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

కొంత గ్యాప్ తరువాత ఈ సినిమాతో బాలయ్య ఎలాగైనా అదిరిపోయే హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.

కాగా ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించేందుకు బోయపాటి అదిరిపోయే స్క్రిప్టును రెడీ చేశాడు.కాగా ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు.అయితే ఈ సినిమాలో బాలయ్యతో పాటు మరో యంగ్ హీరో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

‘ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ’ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన నవీన్ పొలిశెట్టి ఈ సినిమాలో బాలయ్య అసిస్టెంట్‌గా నటిస్తున్నాడని తెలుస్తోంది.ఈ సినిమాలో బాలయ్య చేస్తున్న పొలిటీషియన్ పాత్రకు నవీన్ పొలిశెట్టి అసిస్టెంట్‌గా ఉంటాడని తెలుస్తోంది.

Advertisement

మొత్తానికి బాలయ్య సినిమాలో ఈ కుర్రహీరో కూడా నటిస్తున్నాడంటే సమ్‌థింగ్ స్పెషల్ ఖచ్చితంగా ఉందంటూ చిత్ర వర్గాలు అంటున్నాయి.మరి బోయపాటి ఈసారి బాలయ్యకు ఎలాంటి హిట్‌ను అందిస్తాడో చూడాలి.

అందుకే నేను ఏ రోజు సొంత పిల్లల గురించి ఆలోచించ లేదు : రాజమౌళి
Advertisement

తాజా వార్తలు