రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో రూపొందిన సినిమా నాట్యం.నాట్యం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్య రాజు కీలక పాత్రలో నటించారు.
అంతేకాకుండా కమల్ కామరాజు, రోహిత్ బెహాల్, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, భానుప్రియ తదితరులు నటించారు.ఈ సినిమాను నిశృంఖల ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించగా ఈ సినిమాకు సంధ్యా రాజు నిర్మాతగా బాధ్యతలు చేపట్టారు.
ఇక శ్రవణ్ భరద్వాజ్ సంగీతాన్ని అందించాడు.ఈ రోజు ఈ సినిమా విడుదల సందర్భంగా ఎటువంటి సక్సెస్ అందుకుందో చూద్దాం.
కథ:
నాట్యం అనే గ్రామంలో నివసిస్తున్న సితార (సంధ్యా రాజు) కు క్లాసికల్ డాన్స్ అంటే చాలా ఇష్టం.దీంతో తనకు నృత్యకారిణిగా అవ్వాలని ఆశ ఉంటుంది.
అంతే కాకుండా తన గ్రామంలోనే కాదంబరి కథను నాట్య రూపంలో చేసి అందరికీ చూపించాలని కలలు కంటుంది.ఇక తన గురువు ( ఆదిత్య మీనన్) కు శిష్యురాలిగా ఉంటూ డాన్స్ నేర్చుకుంటుంది.
ఇక కాదంబరి నాట్యం చేయాలని అనుకుంటుంది.కానీ తన గురువు మాత్రం అస్సలు ఒప్పుకోరు.
కారణం ఆ నాట్యం చేసే వాళ్ళు ముందుకు వస్తే చనిపోతారని అంటారు.కానీ సితార మాత్రం ఆ నాట్యాన్నే చేయాలని అనుకుంటుంది.
ఇక అదే సమయంలో రోహిత్ (రోహిత్ బెహాల్) ఎంట్రీ ఇస్తాడు.తను ఓ వెస్ట్రన్ డాన్సర్.
ఇక అతడు నాట్యం గ్రామానికి ఓ పని మీద వస్తాడు.అలా సితార తో పరిచయం పెంచుకుంటాడు.
అతడి వల్ల ఆమె జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి.ఆమె చేసిన ఓ పనికి తన ఊరు వాళ్లంతా తనపై కోపగించుకుంటారు.
ఇక సితార ఆ ఊరిలో ఉండకుండా సిటీకి వెళ్లి పోతుంది.ఆ తర్వాత ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటని ఆమె కాదంబరి నాట్యం చేస్తుందా లేదా అనేది మిగతా కథ లో చూడవచ్చు.
నటినటుల నటన:
సంధ్య రాజు తన పాత్రతో బాగా మెప్పించారు.కమల్ కామరాజు, రోహిత్ కూడా తమ పాత్రలతో, తమ డాన్సులతో బాగా ఆకట్టుకున్నారు.ఇక శుభలేఖ సుధాకర్, భానుప్రియ కూడా ఎప్పటిలాగానే పాత్రలో లీనమయ్యారు.
టెక్నికల్:
డైరెక్టర్ ఈ సినిమాకు కాస్త కొత్తగా కథలు క్రియేట్ చేశాడు.ఈ కథకు తగ్గట్టుగా నటులను ఎంచుకున్నారు.ఇందులో క్లాసికల్ డాన్స్, వెస్ట్రన్ డాన్స్ లకు మంచి ఇంపార్టెంట్ ఇచ్చారు.సినిమాటోగ్రఫీ బాగుంది.
విశ్లేషణ:
ఈ మధ్యకాలంలో ఇటువంటి కథ ప్రేక్షకుల ముందుకు రాలేదు.చాలావరకు స్వర్ణకమలం, ఆనంద భైరవి వంటి సినిమాలకు చెందినట్లుగానే ఉంది.కానీ ప్రేక్షకులను కాస్త కొత్తదనంతో మెప్పించింది.ఇందులో ఎక్కువగా డాన్స్ కి ప్రాధాన్యత ఇచ్చారు.
ప్లస్ పాయింట్స్:
క్లాసికల్ డాన్స్, వెస్ట్రన్ డాన్స్ లు అద్భుతంగా చూపించారు.నటీనటుల పాత్రలు ఆకట్టుకున్నాయి.ఇంటర్వెల్ సీన్ ఆసక్తిగా ఉంది.కొన్ని ఎమోషనల్ సీన్స్, చివరి సీన్ బాగా హైలెట్ గా మారింది.ఈ సినిమాకు భరద్వాజ్ సంగీతం బాగా అనిపించింది.
మైనస్ పాయింట్స్:
కథ కాస్త సాగదీసినట్లు అనిపించింది.ఫస్టాఫ్ చాలా సింపుల్ గా అనిపించింది.ఈ సినిమా తెరపై అంతగా ఆకట్టుకోలేదు.అంతగా బలమైన సీన్స్ కనిపించలేదు.
బాటమ్ లైన్:
ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను మెప్పించడానికి ఇటువంటి కథలు రాలేవు.డాన్స్ పరంగా ఈ సినిమా అద్భుతంగా ఉంది.ఈ సినిమా చూడటానికి పర్వాలేదు.