'దసరా'పై మహేష్ మాస్ రివ్యూ.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన నాని!

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తన తోటి హీరోలను ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాడు.నేను సూపర్ స్టార్ ని నేను వేరే హీరోలను పొగడడం ఏంటి అని ఎప్పుడు మహేష్ ఆలోచించడు.

 Natural Star Reacted To Mahesh Post On Dasara , Dasara, Nani, Keerthy Suresh, Sa-TeluguStop.com

తనకు నచ్చితే అది చిన్న సినిమా అయిన సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు అందించడం ఈయనకు బాగా అలవాటు.ఇక తాజాగా మహేష్ బాబు టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని సినిమాకు ప్రశంసలు కురిపించాడు.

నాని (Nani) లేటెస్ట్ గా నటించిన సినిమా ”దసరా”(Dasara).ఈ సినిమాను సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేయగా మార్చి 30న పాన్ ఇండియా వ్యాప్తంగా ఐదు భాషల్లో రిలీజ్ అయ్యింది.

మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు.నాని ధరణి పాత్రలో, కీర్తి వెన్నెల పాత్రలో నటించి ఈ సినిమాను మరో లెవల్ కు చేర్చారు.

ఈ సినిమాలో నాని నటనకు ఓ రేంజ్ లో ప్రశంసలు వస్తున్నాయి.నాని మాస్ యాక్టింగ్ కు ప్రతీ ఒక్కరూ ఫిదా అయ్యారు అనే చెప్పాలి.ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అయ్యి అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ అందుకుని రెండు రోజుల్లోనే ఏకంగా 50 కోట్ల మార్క్ దాటేసింది.మరి అలాంటి సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

ఈ సినిమాపై మహేష్ బాబు పోస్ట్ పెడుతూ.స్టన్నింగ్ సినిమా అని.దసరా సినిమాపై చాలా గర్వంగా ఉంది అని మహేష్ కామెంట్స్ చేయగా నాని కూడా అదిరిపోయే రిప్లై ఇచ్చారు.ఆయన అభినందనలకు థాంక్స్ చెబుతూ.

మీరు మంచి సినిమాల పట్ల ఇచ్చే వాయిస్ ఎలా ఉందంటే.పోకిరి సినిమాకు మణిశర్మ గారు స్కోర్ అందించినట్టుగా ఉంటుంది.

అని ఇచ్చిన రిప్లై మహేష్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube