తెలంగాణలో అధికారంలో రావడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది.వచ్చే నాలుగు నెలలకు బీజేపీ ప్రణాళికలు రూపొందించింది.
ఇందులో భాగంగా ప్రతినెల తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఉండే విధంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఈనెల 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ కు రానున్నారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.మే నెలలో వరంగల్ లేదా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించి.
మెగా టెక్స్ టైల్ పార్కుకు శంకుస్థాపన చేయనున్నారు.జూన్ లో నల్గొండలో పర్యటన ఉండగా.
ఎయిమ్స్ ను జాతికి అంకితం చేయనున్నారు.జూన్ తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు ప్రధాని మోదీ వెళ్లనున్నారని సమాచారం.
ఇందులో భాగంగా జాతీయ రహదారుల శంకుస్థాపన, నిర్మాణం పూర్తైన వాటిని జాతికి అంకితం ఇవ్వనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.