ఆ ఏరియాలో పొలం కొన్న నాని.. ఖాళీ సమయంలో అక్కడే ఉంటానంటూ?

సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న టాలీవుడ్ హీరోలలో నాని కూడా ఒకరు.

ఒక దశలో వరుస ఫ్లాపులతో కేరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా నాని మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు.

శ్యామ్ సింగరాయ్ సినిమాకు తొలి వీకెండ్ లో రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చినా వీక్ డేస్ లో మాత్రం ఈ సినిమాకు ఎక్కువగా కలెక్షన్లు రాలేదు.అయితే శ్యామ్ సింగరాయ్ ప్రమోషన్లలో భాగంగా నాని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

హైదరాబాద్ నుంచి 60 నిమిషాలు ప్రయాణం చేస్తే తన పొలం వస్తుందని నాని పేర్కొన్నారు.తనకు ప్రకృతి అంటే చాలా ఇష్టమని నాని వెల్లడించారు.

ఆ కారణం వల్లే పొలం, ఆ పొలం పక్కన చిన్న స్థలం కొన్నానని నాని పేర్కొన్నారు.షూటింగ్ లేని సమయంలో, ఖాళీగా ఉన్న సమయంలో తాను ఆ ప్లేస్ కు వెళ్లి గడుపుతానని నాని చెప్పుకొచ్చారు.

Advertisement

కొన్నిసార్లు కుటుంబ సభ్యులు, స్నేహితులతో అక్కడికి వెళతానని నాని వెల్లడించారు.ఆ ప్లేస్ కు వెళితే తనకు చాలా సంతోషంగా ఉంటుందని నాని కామెంట్లు చేశారు.

కరోనా సమయంలో తాను పొలంలోనే ఎక్కువగా గడిపానని నాని వెల్లడించారు.ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 35 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు, 20 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి.పునర్జన్మల కథాంశంతో పీరియాడికల్ స్టోరీగా తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మరోవైపు అతి త్వరలో ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుందని వార్తలు వస్తున్నాయి.నెట్ ఫ్లిక్స్ శ్యామ్ సింగరాయ్ మూవీ ఓటీటీ హక్కులను కొనుగోలు చేసింది.రిపబ్లిక్ డే నుంచి ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుందని బోగట్టా.

అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది.

చంద్రకాంత్ మరణం పై నటుడు నరేష్ షాకింగ్ కామెంట్స్.. నా పరిస్థితి అదేనంటూ?
Advertisement

తాజా వార్తలు