'దసరా'తో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ ఇచ్చిన నాని.. వారికి సమాధానం ఇలా చెప్పాడా?

నాచురల్ స్టార్ నాని ( Nani ) ఇప్పుడు ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ వడ్డించాడు.మండే వేసవిలో మాస్ హీరోను బయటకు తీసి రచ్చ రచ్చ చేసాడు.

 Natural Star Nani Dasara, Nani, Dasara, Keerthy Suresh, Social Media , Tollywoo-TeluguStop.com

తనను ట్రోల్స్ చేసిన వారికీ గట్టి బుద్ధి వచ్చేలా ఒకే ఒక్క సినిమాతో తనని తాను సరికొత్తగా నిరూపించు కున్నాడు.ఇప్పటి వరకు ఎన్నో క్లాస్ సినిమాలను నటించి మెప్పించిన నాని ఇప్పుడు కొత్తగా మాస్ లోకి ఎంటర్ అయ్యి మాస్ కే చుక్కలు చూపించాడు.

నాని కేవలం అలాంటి పాత్రలనే చేయగలడు అని ట్రోల్స్ చేసిన వారికీ ఇప్పుడు సమాధానం చెప్పేలా ”దసరా” (Dasara) సినిమాలో తనని తాను కొత్తగా ప్రెజెంట్ చేసుకున్నాడు.శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”దసరా”.ఈ సినిమా ఈ రోజు పాన్ ఇండియా వ్యాప్తంగా ఐదు భాషల్లో రిలీజ్ అయ్యింది.

నాని గత 15 ఏళ్ల తన సినీ కెరీర్ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకున్నాడు.ఈయన సినిమా అంటే తప్పకుండ చూడాలి అనేలా క్రేజ్ తెచ్చుకున్నాడు.వరుస హిట్స్ అందుకుంటూ ఉన్న తరుణంలో ఇతడి టార్గెట్ మిస్ అయ్యింది.

దీంతో వరుస ప్లాప్స్ వస్తున్నాయి.ప్రేక్షకుల ఆలోచన తీరు మారడంతో నాని చేసే రొటీన్ సినిమాలు అంత సక్సెస్ ఇవ్వలేక పోయాయి.

దీంతో ట్రోలర్స్ రెచ్చిపోయి మరీ నాని మీద ట్రోల్స్ చేసారు.అందుకే ఈసారి రొటీన్ కు భిన్నంగా నాని దసరా సినిమాలో ధరణి రోల్ చేసి తాను ఇలాంటి పాత్రను కూడా చేయగలను అని నిరూపించాడు.100కి 100 శాతం ఈ పాత్రకు న్యాయం చేసి తనలో మాస్ హీరో కూడా ఉన్నాడని ప్రూవ్ చేసుకున్నాడు.క్లాస్ హీరోగా ఈ టైప్ సినిమాలు మాత్రమే చేస్తాడు అన్న వారికీ సమాధానం ఇస్తూ నాని దసరా లాంటి సినిమాలు కూడా చేస్తాడు చేయగలడు అని నిరూపించుకున్నాడు.

దీంతో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందాయని చెప్పాలి.అలాగే ట్రోలర్స్ నోరు కూడా మూయించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube