జబర్దస్త్ కార్యక్రమం ద్వారా గుర్తింపు పొందిన కమెడియన్ ఆర్పీ మల్లెమాల యాజమాన్యం శ్యాం ప్రసాద్ రెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలు రోజురోజుకు వివాదంగా మారుతున్నాయి.ఈ క్రమంలోనే ఈ వ్యాఖ్యలపై జబర్దస్త్ కమెడియన్స్ మాత్రమే కాకుండా ఏకంగా నిర్మాతలు కూడా స్పందిస్తున్నారు.ఈ సందర్భంగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గురించి ఆర్పీ చేసిన విమర్శల గురించి తాజాగా నిర్మాత నట్టి కుమార్ స్పందించారు.
ఈ సందర్భంగా నటి కుమార్ మాట్లాడుతూ
… జబర్దస్త్ నిర్వాహకులు, శ్యాం ప్రసాద్ రెడ్డి గురించి ఆర్పీ ఆ కార్యక్రమంలో ఉన్నప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే ప్రతి ఒక్కరు నమ్మే వాళ్ళు ఆయన జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి బయటకు వచ్చి అక్కడ ఫుడ్ సరిగా లేదు శ్యాం ప్రసాద్ రెడ్డి గారు హెల్ప్ చేయరు అంటే ఎవరు నమ్మరు.మామూలుగానే శ్యాంప్రసాద్ రెడ్డి గారు వివాదాలకు కాంట్రవర్సీలకు దూరంగా ఉంటారు అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చెబితే నమ్మే వాళ్ళు ఎవరూ లేరు అంటూ నట్టి కుమార్ పేర్కొన్నారు.

ఇక జబర్దస్త్ కార్యక్రమంలో ఉన్నవాళ్ళకి ఏదైనా ఆపద వస్తే నాగబాబు గారు ఆదుకుంటారు గాని శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఆదుకోరని చెప్పడం ఏమాత్రం భావ్యం కాదని నట్టి కుమార్ తెలిపారు.నాగబాబు దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆయన సహాయం చేస్తారు ఆ అవసరం ప్రసాద్ రెడ్డి గారికి లేదు.నువ్వు అక్కడ పని చేసిన దానికి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు కరెక్ట్ గా పేమెంట్ ఇచ్చారా లేదా అన్నది మాత్రమే ముఖ్యమని,ఒకవేళ మీకు పేమెంట్ ఇవ్వకపోయి ఉంటే నీవు మాట్లాడాలి కానీ అనవసరంగా తన గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం భావ్యం కాదు అంటూ నట్టి కుమార్ కిరాక్ ఆర్పీ వ్యాఖ్యలను ఖండించారు.