కేసీఆర్‌ మాటలపై జాతీయ మహిళ కమీషన్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇటీవల ఆర్టీసీ కార్మికులతో భేటీ అయిన విషయం తెల్సిందే.డిపోకు అయిదుగురు చొప్పున కేసీఆర్‌తో భేటీకి వెళ్లారు.

ఆ సందర్బంగా ఆర్టీసీ సంస్థపై మరియు కార్మికులపై వరాల జల్లు కురిపించాడు.ఈ సందర్బంగా కేసీఆర్‌ మాట్లాడుతూ మహిళ కండాక్టర్లకు ఇకపై 8 గంటల తర్వాత డ్యూటీ ఉండకుండా చూస్తామని హామీ ఇచ్చాడు.

రోజులు బాగాలేవు అందుకే 8 గంటల వరకు వారు ఇంటికి వెళ్లి పోయేలా చూస్తామంటూ ఈ సందర్బంగా కేసీఆర్‌ ప్రకటించాడు.ఆ ప్రకటనపై జాతీయ మహిళ కమీషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి మహిళలను కించపర్చే విధంగా మాట్లాడారు.మహిళలకు పురుషులతో సమానమైన హోదా మరియు రక్షణ ఇవ్వాలి.

Advertisement

వారిని 8 గంటల వరకు ఇంటికి పరిమితం చేయడం ఏంటీ అంటూ ఈ సందర్బంగా ఆమె ప్రశ్నించారు.ముఖ్యమంత్రి నిర్ణయం ఏమాత్రం కరెక్ట్‌ కాదని, వారికి రక్షణ కల్పించాల్సింది పోయి వారిని 8 గంటలకే ఇంటికి చేరుకోవాలంటూ సూచించడం ఏంటంటూ ఆమె ప్రశ్నించింది.

రేఖ శర్మ వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్పందిస్తూ నిజాలు తెలుసుకుని మాట్లాడాలని, సగం సమాచారంతో అస్సలు స్పందించవద్దంటూ హితవు పలికాడు.

Advertisement

తాజా వార్తలు